సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

K Vasu: మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు కె. వాసు మృతి

ABN, First Publish Date - 2023-05-26T19:25:08+05:30

మెగాస్టార్ చిరంజీవిని నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన సీనియర్ దర్శకుడు కె. వాసు.. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.

Senior Director K Vasu
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)కు చెందిన సీనియర్ దర్శకుడు మరియు రచయిత అయిన కె. వాసు (K. Vasu) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. దర్శకుడిగా 1974వ సంవత్సరంలో కెరీర్ ప్రారంభించిన కె. వాసు మొదటి చిత్రం ‘ఆడపిల్లల తండ్రి’ (Aadapillala Thandri). ఆ తర్వాత ఆయన చేసిన ‘ప్రాణం ఖరీదు’ (Pranam Kharidu) చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjevi) నటుడిగా అరంగేట్రం చేశారు. కె. వాసుది ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని ముదునూరు. వాసు తండ్రి ప్రత్యగాత్మ అలాగే బాబాయి హేమాంబరధరరావు కూడా దర్శకులే. కె. వాసు మృతితో మరోసారి చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. రీసెంట్‌గా నటుడు శరత్ బాబు (Sarath Babu) మృతి చెందిన విషయం తెలిసిందే. (K Vasu Passes Away)

దర్శకుడిగా కె. వాసు.. ‘కోతల రాయుడు, గోపాలరావుగారి అమ్మాయి, ఆరని మంటలు, దేవుడు మావయ్య, తోడుదొంగలు, అల్లుళ్లొస్తున్నారు, అమెరికా అల్లుడు, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం, డామిట్ కథ అడ్డం తిరిగింది, ఆడ పిల్ల, జోకర్ మామ సూపర్ అల్లుడు, రేపటి రౌడీ, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’ వంటి ఎన్నో చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఆయన చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం 2008లో వచ్చిన ‘గజిబిజి’. మెగాస్టార్ చిరంజీవితో ఆయన ఎక్కువగా సినిమాలు చేశారు. కె. వాసు మృతి విషయం తెలిసిన పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ.. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ( Director K Vasu No More)

కె.వాసు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్ (Pawan Kalyan)

‘‘దర్శకులు కె.వాసుగారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్నయ్య చిరంజీవి ముఖ్య పాత్రలో నటించిన ప్రాణం ఖరీదు సినిమా దర్శకులుగా వాసుగారిని మరచిపోలేం. చిరంజీవిగారు తొలిసారి వెండితెరపై కనిపించింది ఆ సినిమాతోనే. వినోదాత్మక కథలే కాకుండా భావోద్వేగ అంశాలను తెరకెక్కించారు. కె.వాసు సినిమాల్లో శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం ప్రత్యేకమైనది. తెలుగునాట షిర్డీ సాయిబాబా చరిత్ర ప్రాచుర్యం పొందటంలో ఆ సినిమా ఓ ముఖ్య కారణమైంది. వాసు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’.

ఇవి కూడా చదవండి:

************************************************

*Adi Seshagiri Rao: ‘అసలు నరేష్ ఎవరు?’.. బాంబ్ పేల్చిన సూపర్ స్టార్ సోదరుడు

*Major: మహేష్ బాబు నిర్మించిన సినిమాకు ఘోర అవమానం

*TholiPrema Re Release: సపోర్ట్ చేసేదే లేదంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?

*Virinchi Varma: కామ్‌గా షూటింగ్ మొదలెట్టేసిన దర్శకుడు

Updated Date - 2023-05-26T20:34:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!