Mega Princess: చిరు ఇంట మెగా వేడుక!
ABN, First Publish Date - 2023-06-30T10:39:43+05:30
రామ్‌చరణ్ , ఉపాసన తల్లిదండ్రులు కావడం, మెగా కుటుంబంలోకి ప్రిన్సెస్ రావడంతో చిరు కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ కుటుంబంలోకి మహాలక్ష్మీ అడుగుపెట్టిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శుక్రవారం మెగా ఇంట మరో సందడి నెలకొంది.
రామ్‌చరణ్(Ram Charan), ఉపాసన (Upasana) తల్లిదండ్రులు కావడం, మెగా కుటుంబంలోకి ప్రిన్సెస్ రావడంతో చిరు కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. మెగాస్టార్ కుటుంబంలోకి (mega event)మహాలక్ష్మీ అడుగుపెట్టిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శుక్రవారం మెగా ఇంట మరో సందడి నెలకొంది. మెగా ప్రిన్సెస్ కోసం ఓ ఫంక్షన్ చేస్తున్నారు. మనవరాలిని చిరంజీవి ఉయ్యాలలో వేస్తున్నారు. దీనికి సంబంధించి చిరంజీవి తన ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉయ్యాలలో వేసి, 21వ రోజున మెగా ప్రిప్సెస్‌కి నామకరణ చేస్తారని సన్నిహితుల నుంచి సమాచారం. మెగా ప్రిన్సెస్ అని పిలుచుకుంటున్న రామ్‌చరణ్-ఉపాసనల పుత్రికకు ఇప్పటికే ఓ పేరు అనుకున్నారు. సంప్రదాయం ప్రకారం 21వ రోజును వెల్లడిస్తాం అని రామ్ చెప్పిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం చిరంజీవి ఇంట జరుగుతున్న వేడుక ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. (Mega princess cradle ceremony)
ఈ నెల 20వ తేది అర్ధరాత్రి 1.49 నిమిషాలకు అపోలో ఆస్పత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే! పాప పుట్టాక తొలిసారి మీడియా ముందుకొచ్చిన చరణ్ తన బిడ్డ ‘నాన్న పోలికతోనే’ ఉందని చెప్పారు. మరోవైపు చిరంజీవి కూడా మనవరాలి రాకతో ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆయన ఇంటి ఇలవేల్పు అయిన ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజు మంగళవారంనాడు మనవరాలు పుట్టడం ఎంతో శుభసూచకమని చిరంజీవి చెప్పారు. రామ్‌చరణ్ -ఉపాసన ఓ బిడ్డను మా చేతిలో పెట్టాలనే ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని చిరంజీవి ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే!