Mega Family: అల్లు అర్జున్ చెప్పలేదు, మరి చిరంజీవి సమాధానం ఏంటంటే...
ABN, First Publish Date - 2023-03-29T14:02:54+05:30
మెగా అభిమానులు మరోసారి కొట్టుకుంటున్నారు. ఈసారి మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇంతకీ విషయం ఏంటి అంటే...
సాంఘీక మాధ్యమం లో మళ్ళీ మెగా అభిమానులు విరుచుకు పడుతున్నారు. ఈసారి వేరేవాళ్ళ మీద కాకుండా, మెగా కుటుంబ సభ్యుడు అయిన అల్లు అర్జున్ (Allu Arjun) మీద. ఇంతకీ విషయం ఏంటి అంటే, రామ్ చరణ్ (Ram Charan birthday) పుట్టిన రోజు నాడు సినిమా పరిశ్రమలో చాలామంది విషెస్ తెలియచేసారు, అలాగే రామ్ చరణ్ ఇచ్చిన విందు పార్టీ కి కూడా హాజరయ్యారు. అయితే ఇలా అందరూ విషెస్ చెపుతుంటే, చెప్పని వారు ఒకడున్నాడు, అతనే అల్లు అర్జున్. వాళ్ళు ఒకరినొకరు కలిసి చెప్పుకున్నారా, లేక ఫోన్ చేసి మాట్లాడుకున్నారా అన్నది అభిమానులకి అవసరం లేదు, ఇప్పుడు సాంఘీక మాధ్యమం చాలా ప్రాముఖ్యం కాబట్టి అందులో చెప్పలేదు అల్లు అర్జున్. అందుకే మెగా అభిమానులు అల్లు అర్జున్ ని ట్రోల్ (Troll) చేస్తున్నారు బాగా ఇప్పుడు.
ఇలా మెగా అభిమానులు అందరూ చాలా కోపంగా అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తుంటే, మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఏమి చేశారో తెలుసా. అల్లు అర్జున్ ని 20 సంవత్సరాలు సినిమా పరిశ్రమలో పూర్తి చేసిన సందర్భంగా చిరంజీవి అతన్ని ప్రశంసిస్తూ ఒక ట్వీట్ పెట్టాడు. "20 సంవత్సరాలు అప్పుడే అయిపోయాయి అంటే నమ్మబుద్ధి కావటం లేదు. నువ్వు పిల్లాడిగా వున్నప్పుడు ఆలోచనలే వున్నాయి. నువ్వు ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ గా, ఐకాన్ స్టార్ గా ఎదిగావు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్దగా ఎదగాలి, అందరి ప్రసంశలు అందుకోవాలి", అని చిరంజీవి అన్నారు.
అయితే అల్లు అర్జున్ మరి రామ్ చరణ్ పుట్టినరోజు కి విషెస్ చెప్పలేకపోయినా, చిరంజీవి ఇలా ఈరోజు అల్లు అర్జున్ గురించి ట్వీట్ చెయ్యడం కూడా మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని అల్లు అర్జున్ ని ట్రోల్ చెయ్యడమే కాకుండా, చిరంజీవి బాగా ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు 'పుష్ప 2' (Pushpa 2) సినిమా షూటింగ్ చేస్తుండగా, రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' (Game Changer) సినిమా షూటింగ్ తో బిజీ గా వున్నాడు.