Mega Fans Fire: దయచేసి నిద్రలేవండి సారూ
ABN, First Publish Date - 2023-06-26T14:16:29+05:30
టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుపై (Dil raju) మెగా అభిమానులు మండిపడుతున్నారు (Mega Fans Fire). తాజాగా ఆయన రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీగా రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రం అప్‌డేట్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుపై (Dil raju) మెగా అభిమానులు మండిపడుతున్నారు (Mega Fans Fire). తాజాగా ఆయన రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీగా రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రం అప్‌డేట్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్వ్టిట్టర్ వేదికగా దిల్ రాజును ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల తండ్రైన రామ్‌చరణ్ తన మెగా ప్రిన్సెస్‌తో ఆడుకునే పనిలో బిజీగా అయ్యారు. రోజూ ఆయన ఇంటికి పాపను చూసేందుకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చరణ్ ఆ పనుల్లో బిజీ అయ్యారు. దాంతోపాటు కొంతకాలంపాటు రామ్‌చరణ్ (Ram CHaran) తన భార్య ఉపాసన, మెగా ప్రిన్సెస్‌తో (Mega Princess) గడపాలన్న ఉద్దేశంతోనే షూటింగ్‌కు కొంతకాలం విరామం ఇచ్చారు. అభిమనులు కూడా ప్రస్తుతం మెగా కుటుంబానికి వారసురాలొచ్చిందన్న ఆనందంలో మునిగిపోయారు. ఈ ఆనందానికి బోనస్‌గా ‘గేమ్ ఛేంజర్’ చిత్రం గురించి కొత్త అప్‌డేట్ కోరుకుంటున్నారు. (Update Please)
ఈ సినిమా ప్రారంభమై ఏడాది పైనే కావొస్తుంది. దర్శకుడు శంకర్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రీకరణతోపాటు అటు ఇండియన్-2 చిత్రీకరణ కూడా చేస్తున్నారు. దాంతో రామ్‌చరణ్ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుండడంతో అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు. షూటింగ్ లేట్ అయితే సినిమా విడుదల కూడా లేటవుతుంది అంటూ దర్శకనిర్మాతలపై విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమై ఏడాదిన్నర కావొస్తున్న హీరోహీరోయిన్ల లుక్ మినహా గ్లింప్స్, టీజర్ లాంటివి ఏమీ విడుదల చేయకపోవడంతో అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ దర్శక నిర్మాతలిద్దరిని #UselessDilRajuShamelessSVC, #WakeUpShankarSir నెగెటివ్ హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు. నెగటివ్ కామెంట్లు చేస్తూ, ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వాలని బలవంతం చేస్తున్నారు. మరి దీనిపై నిర్మాత దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా ఈ చిత్రంలో కియారా అడ్వాణీ నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్రకీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాణ సంస్థకు ఇది 50వ చిత్రం కావడం విశేషం.
అప్‌డేట్‌ల కోసం అభిమానులు నిర్మాతలపై ఒత్తిడి తీసుకురావద్దని, మరోసారి అభిమానులు ఇలాగే కొనసాగిస్తే సినిమా చేయడం మానేయాల్సిన పరిస్థితి వస్తుందని ఇటీవల ఓ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులను హెచ్చరించారు. మరి రామ్‌చరణ్ ఈ ఇష్యూపై ఎలా స్పందిస్తారో చూడాలి.