సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Meena : క్రష్‌ ఎవరో తెలుసా.. అతని పెళ్లి రోజు గుండె పగిలిందట!

ABN, First Publish Date - 2023-03-14T13:34:15+05:30

మూడున్నర దశాబ్దాలకుపైగా స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు మీనా. బాల నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె సౌత్‌ స్టార్‌ హీరోలు అందరితో నటించారు. కెరీర్‌ పీక్స్‌లో ఉండగా 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడున్నర దశాబ్దాలకుపైగా స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు మీనా(Meena). బాల నటిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె సౌత్‌ స్టార్‌ హీరోలు అందరితో నటించారు. కెరీర్‌ పీక్స్‌లో ఉండగా 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను (Meena Sagar) పెళ్లాడింది. వీరిద్దరికీ నైనికా అనే పాప ఉంది. గతేడాది జూన్‌లో మీనా భర్త మరణించారు. ఇప్పుడిప్పుడే ఆమె ఆ బాధ నుంచి బయటకొచ్చి పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీ అయ్యారు. మీనా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 40 ఏళ్లు పూర్తికావొస్తుంది. ఈ సందర్భంగా ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి ముందు తనకు ఒకరిపై ఉన్న క్రష్‌ గురించి బయటపెట్టారు. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని అమ్మతో చెప్పానని మీనా వెల్లడించారు. (Meena Crush) ఇంతకీ ఆ బాలీవుడ్‌ హీరో ఎవరో కాదు... హృతిక్‌ రోషన్‌. ‘‘ఆయన్ను చాలా ప్రేమించాను. అమ్మ నాముందు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు హృతిక్‌ లాంటి అబ్బాయి కావాలని చెప్పాను. హృతిక్‌ పెళ్లి రోజు నా గుండె పగిలింది. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అని మీనా చెప్పారు ( Meena reveals crush with Hrithik Roshan)

Updated Date - 2023-03-14T13:35:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!