Ravi Teja: ‘హను-మాన్’కి ‘ఈగల్’ సపోర్ట్
ABN, Publish Date - Dec 27 , 2023 | 04:33 PM
రాబోయే సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’.. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘హను-మాన్’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ‘హను-మాన్’ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్‌డేట్ వదిలారు. ఈ సినిమాలో వానరం చేస్తున్న కోటి పాత్ర రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లుగా తెలియజేశారు.
రాబోయే సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటించిన ‘ఈగల్’ (Eagle).. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘హను-మాన్’ (Hanu Man) సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ‘హను-మాన్’ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అప్‌డేట్ వదిలారు. అదేంటి అంటే.. ‘హను-మాన్’కి ‘ఈగల్’ సపోర్ట్ చేయనుంది. అంటే ‘ఈగల్’ సినిమా విడుదలను ఏమైనా వాయిదా వేస్తున్నారని అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదు. ‘హను-మాన్’ సినిమాలోని ఓ పాత్రకు ‘ఈగల్’ హీరో రవితేజ వాయిస్ ఓవర్ (Voice Over) ఇస్తున్నారు. ఈ విషయం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
హనుమంతుడిని వానర రూపంలో కొలుస్తారు. వానరములను హిందువులు పూజిస్తారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి సినిమా అయిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘హను-మాన్’లో వానరం యొక్క ప్రత్యేక పాత్ర ఉంది. ‘హను-మాన్’లో వానరం పేరు కోటి కాగా.. అది సినిమా అంతటా ఉంటుందని.. ఈ కీలక పాత్రకు మాస్ మహారాజా రవితేజ తన వాయిస్‌ని అందిస్తున్నారని మేకర్స్ తెలియజేశారు. అంతేకాదు, కోటి పాత్రకు రవితేజ డబ్బింగ్ చెబుతున్న పోస్టర్ కూడా వదిలారు. సాధారణంగా, వానరములు వాటి చంచలమైన స్వభావం, చమత్కారమైన చర్యలు, అత్యంత శక్తికి ప్రసిద్ధి చెందాయి. రవితేజ వాయిస్‌తో పాత్ర మరింత హ్యూమర్స్, ఎనర్జిటిక్‌గా ఉండబోతోందని.. రేపు సినిమా చూసిన వారంతా ఈ వాయిస్‌కు బాగా కనెక్ట్ అవుతారని చిత్ర బృందం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. (Ravi Teja Supports Hanu Man)
తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రవితేజ సపోర్ట్ బిగ్ బెనిఫిట్. నిజానికి చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు సపోర్ట్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు రవితేజ. మాస్ మహారాజా రవితేజ సపోర్ట్‌కు హను-మాన్ టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అఖండ భారత్‌లోని ఇతిహాసం నుండి ప్రేరణ పొందిన హను-మాన్ ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం. అంజనాద్రి అనే ఫాంటసీ లోకం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషల్లోనూ మంచి స్పందనను రాబట్టుకుంది. అమృత అయ్యర్ కథానాయికగా, వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. జనవరి 12న సంక్రాంతికి తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా ‘హను-మాన్’ విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
====================
*Sriya Reddy: ‘సలార్’ పార్ట్ 1లో ఏం చూశారు.. అసలు విషయం పార్ట్ 2లో..
************************
*Kalyan Ram: ఏ విషయమైనా క్లారిటీ ఉంటేనే.. నేను, తమ్ముడు తారక్ స్పందిస్తాం
*****************************
*Thandel: సముద్రం మధ్యలో.. చైతూ ‘తండేల్’ అప్‌డేట్
**************************