Ravanasura: రవితేజ ‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు’.. ఎప్పుడంటే?
ABN, First Publish Date - 2023-03-13T21:32:31+05:30
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ (Ravanasura). ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’ (Ravanasura). ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్‌ను అందుకున్న విషయం తెలిసిందే. రవితేజ మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే.. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రంలోని మూడవ సింగిల్ (Ravanasura Third Single)- వెయ్యిన్నొక్క జిల్లాల వరకు (Veyyinokka Jillala Varaku) లిరికల్ వీడియోను మార్చి 15న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ పాట విడుదలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే.. ఇది రెట్రో నేపథ్య పాట (retro-themed song) అని తెలుస్తోంది. రవితేజ (Ravi Teja), మేఘా ఆకాష్ (Megha Akash) ఇద్దరూ స్కూటర్‌పై కూర్చొని రెట్రో కాస్ట్యూమ్స్‌లో కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమో (promo of the song) మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుండగా.. ఫుల్ సాంగ్ మార్చి 15న రానుంది.
విజయ్ కార్తీక్ కన్నన్ (Vijay Kartik Kannan) సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా (Srikanth Vissa) కథను అందించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా (Abhishek Nama), రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మరో హీరో సుశాంత్ (Sushanth) కీలక పాత్రలో నటిస్తుండగా.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
*********************************
*Oscar to RRR: తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందనిదే..
*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి
*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం
*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?
* Harish Shankar: పెరుగన్నం, బిర్యానీ.. దర్శకుడు మహాకు కౌంటర్
*Pavitra Naresh: బ్యాచ్‌లర్స్ ఫీల్ కాకండి.. ఈ మీమ్స్ ఏంటి సామి?
*Ram Charan: మా నాన్న పెంపకం అలాంటిది.. ఆసక్తికర విషయాలు చెప్పిన చరణ్
*Radha Nair: తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమో.. మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమో?