Sankranthi Box Office: ఏ సినిమా వెనక్కి తగ్గుతుంది, లేక అన్నీ విడుదలవుతాయా...
ABN, First Publish Date - 2023-10-21T13:33:20+05:30
ఈసారి సంక్రాంతి బరిలో చాలా సినిమాలు వున్నాయి, అయితే ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్స్ సరిపోతాయా, లేక కొన్ని సినిమాలు విడుదల వాయిదా వేసుకుంటాయా, అసలు చివరికి ఎన్ని ఉంటాయి బరిలో అనే చర్చ పరిశ్రమలో నడుస్తోంది
రానున్న సంక్రాంతి పండగకు టాలీవుడ్ లో మునుపెన్నడూ లేనంతగా పోటీ ఉండొచ్చు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఈసారి చాలా సినిమాలు సంక్రాంతి పండగకు విడులా తేదీలు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రభాస్ (Prabhas) నటిస్తున్న 'సలార్' #Salaar డిసెంబర్ 22వ తేదీ విడుదలవుతుండటంతో, ఆరోజు విడుదల కావాలసిన కొన్ని సినిమాలు కూడా సంక్రాంతి పండగ పోటీలో ఉండటం విశేషం.
ముందుగా మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) కాంబినేషన్ లో వస్తున్న 'గుంటూరు కారం' #GunturKaaram జనవరి 12న విడుదల అని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. చాలా భాగం అయిపొయింది అని కూడా అంటున్నారు, కేవలం, క్లైమాక్స్ సన్నివేశాలు, నాలుగు పాటలే మిగిలి వున్నాయి, అందుకని ఈ సినిమా సంక్రాంతి పదంగాకి ఖాయం అని అంటున్నారు. అలాగే ఇంకో సినిమా 'నా సామి రంగా' #NaaSaamiRanga. నాగార్జున (AkkineniNagarjuna) నటిస్తున్న ఈ సినిమాకి విజయ్ బిన్ని (VIjayBinni) దర్శకుడు, ఈ సినిమా కూడా ఒక్కరోజు గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ జరుగుతోంది అని తెలిసింది. ఇది కూడా సంక్రాంతి పండగకి ఖాయం అని అంటున్నారు.
ఇక విజయ్ దేవరకొండ (VijayDeverakonda), మృణాల్ ఠాకూర్ (MrunalThakur) నటిస్తున్న 'ఫామిలీ స్టార్' #FamilyStar సినిమా. దీనికి పరశురామ్ పెట్ల (ParasuramPetla) దర్శకుడు, దిల్ రాజు (DilRaju) నిర్మాత. ఈ సినిమా కూడా సంక్రాంతికి వస్తున్నాం అని అధికారికంగా ప్రకటించేశారు. వెంకటేష్ (Venkatesh) నటిస్తున్న 'సైంధవ్' #Saindhav కూడా సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ సినిమా డిసెంబర్ 22 అనుకున్నారు, కానీ అదే తేదీకి 'సలార్' #Salaar రావటంతో ఇది సంక్రాంతికి వచ్చేసింది. అలాగే రవితేజ (RaviTeja) నటించిన 'ఈగిల్' (Eagle) సినిమా కూడా సంక్రాంతి పోటీలో వుంది. ఇది ఒక యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. దీనికి కార్తీక్ ఘట్టమనేని (KarthikGhattamaneni) దర్శకుడు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ (PeoplesMediaFactory) నిర్మాత. వీటన్నితో పాటు ప్రశాంత్ వర్మ (PrashanthVarma) దర్శకత్వంలో వస్తున్న 'హనుమాన్' #Hanuman ఫాంటసీ మూవీ కూడా సంక్రాంతి పండగకు వస్తోంది అని అంటున్నారు. ఇవన్నీ కాకుండా రజినీకాంత్ (Rajinikanth) నటించిన 'లాల్ సలాం' #LalSalaam కూడా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం వుంది.
అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇన్ని సినిమాలు సంక్రాంతి పండగనాడు విడుదలైతే వీటన్నిటికీ థియేటర్స్ దొరుకుతాయా అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఇందులో కొన్ని సినిమాలు కేవలం సంక్రాంతి నాడు వస్తాయి అని ప్రకటించాయి కానీ, మళ్ళీ ముందుకు జరుగుతాయి అని కూడా అంటున్నారు. ఎందుకంటే మహేష్ బాబు సినిమా విడుదలలో జాప్యం జరిగే అవకాశం ఉంటే, ఈ సినిమాలు అన్నీ విడుదలకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి అని అంటున్నారు. కానీ మహేష్ సినిమా పక్కాగా సంక్రాంతికి వస్తోంది అని రూడీ అయింది, అందుకని మిగతా సినిమాల్లో కొన్ని వాయిదా పడే అవకాశం వుంది అని అంటున్నారు. ఏమైనా రానున్న సంక్రాంతికి కొన్ని వందల కోట్ల వ్యాపారం పరిశ్రమకి అయ్యే సూచనలు కనపడుతున్నాయి.
సంక్రాంతి పోటీల్లో వున్న సినిమాలు
గుంటూరు కారం (మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్))
సైంధవ్ (వెంకటేష్, శైలేష్ కొలను)
ఈగిల్ (రవి తేజ, కార్తీక్ ఘట్టమనేని)
నా సామి రంగా (నాగార్జున, విజయ్ బిన్నీ)
ఫామిలీ స్టార్ (విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల)
హనుమాన్ (తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ)
లాల్ సలాం (రజినీకాంత్, డబ్బింగ్ సినిమా)
అయలాన్ (శివకార్తికేయన్, డబ్బింగ్ సినిమా)