PS2 - Maniratnam: ఇంతకు ముందు చాలా సార్లు చెప్పా.. మళ్లీ చెబుతున్నా
ABN, First Publish Date - 2023-04-24T15:08:32+05:30
'పొన్నియిన్ సెల్వన్-2’ (Ponniyin Selvan 2) ప్రీ రిలీజ్ వేడుక వేదికగా దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళిని ప్రశంసల వర్షం కురిపించారు మణిరత్నం (Maniratnam).
'పొన్నియిన్ సెల్వన్-2’ (Ponniyin Selvan 2) ప్రీ రిలీజ్ వేడుక వేదికగా దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళిని ప్రశంసల వర్షం కురిపించారు మణిరత్నం (Maniratnam). భారతీయ చరిత్రను సినిమాలుగా మలిచేందుకు రాజమౌళి పెద్ద మార్గాన్ని వేశారని కొనియాడారు. ‘బాహుబలి’ (Babhuba;i inspiration) స్ఫూర్తితోనే ‘పొన్నియిన్ సెల్వన్’(Ponniyin Selvan)ను తీసినట్లు చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘పొన్నియన్ సెల్వన్ -2’ వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘‘ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా. ‘బాహుబలి’ లేకపోతే ‘పొన్నియిన్ సెల్వన్’ లేదు. రాజమౌళి తన సినిమాను రెండు తన చిత్రాన్ని రెండు భాగాలుగా తీయకపోతే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది కాదు. ఇదే విషయాన్ని నేను రాజమౌళిని కలిసినప్పుడు చెప్పాను. అతను వేసిన మార్గంలో మేమంతా వెళ్తున్నాం. రాజమౌళి మన సినిమాకు అంతర్జాతీయ స్థ్థాయిలో గుర్తింపు దక్కేలా చేశారు. ఆయన అలా చేయడం వల్లే ఇప్పుడు మేమంతా ప్యాన్ ఇండియా స్థాయి చిత్రాలు తీయడానికి ముందుకొచ్చాం. మా యూనిట్ సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాలంటే నిర్మాత సుభాస్కరన్ గురించి చెప్పాలి. ఆయన వల్లనే ఈ సినిమా చేయడం సాధ్యపడింది. రెండు భాగాలుగా తెరకెక్కించడానికి మాత్రం రాజమౌళి కారణం’’ అని అన్నారు.
సినీ కెరీర్‌కి గోల్డెన్ మూమెంట్: కార్తి (Karthi)
‘స్కూల్, కాలేజ్‌ల్లో ఫేర్‌వెల్ జరిగినప్పుడు ‘మన లైఫ్‌లో గోల్డెన్ టైమ్ అంటే ఇదేరా! అనిపిస్తుంది. మా సినీ కెరీర్ పరంగా ‘పొన్నియన్ సెల్వన్’ మా అందరికీ గోల్డెన్ మూమెంట్. ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నాం. ఈ సినిమాతో దొరికిన స్నేహితులు నా లైఫ్ అంతా ట్రావెల్ అవుతారు. విక్రమ్‌గారిని చూసి ఎలా వర్క్ చేయాలనేది నేర్చుకున్నా. ఎంత అలసిపోయినా షాట్ రెడీ అంతే రెట్టింపు ఉత్సాహంతో వస్తారు. మణిరత్నం నా గురువుగారు. ఆయన ఆశీర్వాదంతో నా సినీ ప్రయాణం మొదలైంది. ఆయన సినిమాల గురించి నాకంటే తెలుగు ప్రేక్షకులకే బాగా తెలుసు. పీఎస్ 1 ఎంటర్‌టైన్మెంట్ అయితే పీఎస్ 2 క్లాసిక్ మూవీ’’ అని అన్నారు.
వంద సినిమాలైనా రెడీ: విక్రమ్ (Chiyaan Vikram)
తెలుగు ప్రేక్షకుల ఎనర్జీ అమేజింగ్. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్నో ప్రాంతాలకు తిరిగాం. కానీ తెలుగు ప్రేక్షకుల నుంచి దక్కే అభిమానం వేరే లెవల్‌లో ఉంటుంది. పీఎస్ 1 తెలుగులో పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అదే ప్రేమను ‘పీఎస్2’కూ లోనూ చూపిస్తారనుకుంటున్నాను. మణిరత్నం జీనియస్ డైరెక్టర్. ఆయనతో వంద సినిమాలైనా చేయాలనుంటుంది’’ అని అన్నారు.
మణిరత్నం దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థ్‌లు సంయుక్తంగా నిర్మించిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ఈనెల 28న విడుదల కానుంది. తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రధారులు.