Manchu Vishnu: ఆ పాట పూర్తయ్యే సరికి ఏడుపొచ్చేసింది!
ABN, First Publish Date - 2023-03-02T15:31:39+05:30
తన గారాల బిడ్డలు ఆరియానా, వివియానా ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి మంచు విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు. తన బిడ్డలిద్దరూ ఇచ్చిన బహుమతి చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయంటూ ఆయన ట్వీట్ చేశారు.
తన గారాల బిడ్డలు ఆరియానా(Ariaana), వివియానా (Viviana)ఇచ్చిన సర్‌ప్రైజ్ చూసి మంచు విష్ణు (Manchu Vishnu Tweet) భావోద్వేగానికి లోనయ్యారు. తన బిడ్డలిద్దరూ ఇచ్చిన బహుమతి చూసి తనకు కన్నీళ్లు వచ్చేశాయంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆరియానా-వివియానా ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే... (manchu Vishnu - Viranika)
బుధవారం మంచు విష్ణు - ఆయన సతీమణి విరానికా 15వ వివాహ వార్షికోత్సవాన్ని చేసుకున్నారు. ఈ సందర్భంగా అరియానా, వివియానా తన తల్లిదండ్రులను సర్‌ప్రైజ్ (wedding anniversary surprise)చేస్తూ ఓ వీడియో చేసి బహుమతిగా అందించారు. అందులో పెళ్లి నుంచి ఇప్పటి దాకా విష్ణు- విరానికాకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్ అన్నింటినీ పొందుపరిచారు. ‘మై ఫాదర్ లవ్స్ మై మామ్’ అంటూ ఓ పాటను ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ను విష్ణు ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ.. ‘‘ఈ పాట పూర్తయ్యే సమయానికి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. థ్యాంక్యూ డార్లింగ్స్. ఈ సర్‌ప్రైజ్‌ను నేను ఎప్పటికీ మర్చిపోను’’ అని రాసుకొచ్చారు. విష్ణు నటించిన ‘జిన్నా’ చిత్రంలో ఆరియానా-వివియానా ఓ పాట పాడిన విషయం తెలిసిందే! (Manchu Vishnu Viral tweet)