Manchu Manoj - Mounika: అప్పుడే నెల అంటూ క్యూట్ వీడియో!
ABN, First Publish Date - 2023-04-03T15:33:33+05:30
నాలుగేళ్ల ప్రేమ ఫలించడంతో మంచు మనోజ్ - భూమా మౌనికరెడ్డి గత నెల మూడో తేదీన వివాహబంధంతో ఒకటయ్యారు. ఈ జంట పెళ్లై సోమవారానికి నెల పూర్తయింది.
నాలుగేళ్ల ప్రేమ ఫలించడంతో మంచు మనోజ్(manchu manoj) - భూమా మౌనికరెడ్డి (Bhuma mounika reddy) గత నెల మూడో తేదీన వివాహబంధంతో ఒకటయ్యారు. ఈ జంట పెళ్లై సోమవారానికి నెల పూర్తయింది. ఈ సందర్భంగా మనోజ్ భార్యతో కలిసి ఓ క్యూట్ వీడియో (manoj posted cute video) షేర్ చేశారు. దీనికి ‘ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రియా ప్రియా చంపొద్దే అంటూ సాగే పాటను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత నెల మూడో తేదిన మనోజ్ - మౌనిక వివాహబంధంతో ఒకటయ్యారు. 12 ఏళ్లుగా పరిచయం ఉన్న వీరిద్దరూ నాలుగు సంవత్సరాలు క్రితం మరింత దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నారు. పెళ్లైన మరుసటి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నాలుగో రోజు కర్నూల్ జిల్లా నంధ్యాల వెళ్లి తన అత్తమామల సమాధులను సందర్శించి నివాళులు అర్పించారు. (Manchu manoj)
ప్రస్తుతం మనోజ్ సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.