కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manchu Manoj : తొమ్మిది నెలల తర్వాత మౌనిక గురించి ఏమన్నాడంటే!

ABN, First Publish Date - 2023-12-07T18:29:15+05:30

మంచు మనోజ్‌ (Manchu Manoj) కొత్త జర్నీ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది భూమా మౌనికను (Bhuma Mounika) పెళ్లాడి, వ్యక్తిగత జీవితంలో కొత్త జర్నీని ప్రారంభించిన ఆయన వ్యత్తిరీతా కూడా న్యూ జర్నీ మొదలుపెట్టానున్నారు. వెండితెరపై హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

మంచు మనోజ్‌ (Manchu Manoj) కొత్త జర్నీ ప్రారంభించనున్నారు. ఈ ఏడాది భూమా మౌనికను (Bhuma Mounika) పెళ్లాడి, వ్యక్తిగత జీవితంలో కొత్త జర్నీని ప్రారంభించిన ఆయన వ్యత్తిరీతా కూడా న్యూ జర్నీ మొదలుపెట్టానున్నారు. వెండితెరపై హీరోగా అలరించిన ఆయన ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఓటీటీ కోసం ఆయన 'ఉస్తాద్‌ ర్యాంప్‌ ఆడిద్దాం’ (Ustaad Ramp aadidham)అనే టాక్‌ షో చేయబోతున్నారు. ఈ నెల 15 నుంచి ఈ షో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్  కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనోజ్‌ ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశారు.

మనోజ్‌ మట్లాడుతూ "ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత.. ఏడడుగులు వేసి మళ్లీ ఇండస్ట్రీకి  వస్తున్నా. ఈ గ్యాప్‌లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ అభిమానులు చూపించే ప్రేమలోనే ఏడేళ్ల తర్వాత ప్రేమ, బాధ్యతతోనే వస్తున్నా. కష్ట సమయంలో అభిమానులు చూపించిన ప్రేమే నాకు దైర్యం ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ పుట్టాను. మీ ముందుకు మంచి షోతో వస్తున్నా’’ అని అన్నారు.

భార్యతో ఈ ఈవెంట్‌కు హాజరైన ఆయన మౌనిక గురించి ఆయన మాట్లాడారు. మౌనికతో ప్రేమలో పడ్డాకే ఫ్యాన్స చూపించే ప్రేమ విలువ తెలిసిందని అన్నారు. వేదికపై మనోజ్‌ మాట్లాడుతుండగా మౌనిక ఎమోషనల్‌ అయింది. భర్త మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంది?ంచిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated Date - 2023-12-07T18:29:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!