సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manoj Mounika: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన మంచు లక్ష్మీ

ABN, First Publish Date - 2023-03-06T20:00:31+05:30

దివంగత భూమా నాగిరెడ్డి (Bhuma Naagi reddy), శోభా నాగిరెడ్డి (Bhuma Shoba Naagireddy) దంపతుల కుమార్తె భూమా మౌనిక (Bhuma Mounika) ని మంచు మనోజ్‌ (Manchu Manoj) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దివంగత భూమా నాగిరెడ్డి (Bhuma Naagi reddy), శోభా నాగిరెడ్డి (Bhuma Shoba Naagireddy) దంపతుల కుమార్తె భూమా మౌనిక (Bhuma Mounika) ని మంచు మనోజ్‌ (Manchu Manoj) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం మార్చి 3న అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా పెళ్లికి సంబంధించిన ఎమోషనల్ వీడియోను మంచు లక్ష్మీ ప్రసన్న సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మంచు మనోజ్ వీడియోను ఆయన సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘నవ్వు, ప్రేమ, ఆనందాన్ని ఎప్పటికీ పదిలపర్చాను’’ అని లక్ష్మీ ప్రసన్న క్యాప్షన్ చేశారు. ఈ వీడియోలో పెళ్లి సంబరాలు ఉట్టిపడ్డాయి. మనోజ్‌ను పెళ్లికొడుకు చేసి లక్ష్మీ తెగ మురిసిపోయారు. మౌనికను పెళ్లికూతురుగా మండపంలోకి తీసుకొచ్చారు. మనోజ్ తండ్రి మోహన్‌బాబు పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న సందర్భంగా మనోజ్‌, మౌనికల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ వీడియోను దాదాపుగా 23వేల మంది వీక్షించారు. 1700లైక్స్ వచ్చాయి.

మంచు మనోజ్‌కు 2015లోనే ప్రణతి రెడ్డితో వివాహమైంది. పలు కారణాలతో 2019లో పరస్పర అంగీకారంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. మౌనికా రెడ్డికి గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి అయింది. అని‌వార్య కారణాల వల్ల వారు విడిపోయారు. ఆమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. తాజాగా మౌనికను పెళ్లి చేసుకున్న మనోజ్‌ .. కొడుకు బాధ్యతను కూడా తీసుకున్నట్లు ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ ద్వారా తెలిపారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-06T20:44:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!