సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Manchu Family: మనోజ్ వీడియో లో విష్ణు ఎందుకు లేడు, అన్నదమ్ముల వివాదం అలాగే ఉందా...

ABN, First Publish Date - 2023-04-19T18:28:09+05:30

మంచు కుటుంబంలో విష్ణు, మనోజ్ మధ్య వివాదం ఇంకా సమసినట్లు లేదు. ఎందుకంటే మనోజ్ కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన వీడియో పాటలో మంచు విష్ణు కేవలం మూడు నాలుగు సెకన్లు మాత్రమే...

Manchu family
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమధ్య మంచు బ్రదర్స్ #ManchuFamily వార్తల్లో వున్నారు. మంచు మనోజ్ (Manchu Manoj) అనుచరుడు సారధిని (Saradhi), తన అన్న విష్ణు (Manchu Vishnu) కొట్టాడని మంచు మనోజ్ వీడియో షేర్ చేసాడు. అప్పుడది పెద్ద వైరల్ అయింది, ప్రముఖ వార్త కూడా అయింది. అయితే మంచు కుటుంబం నుండి దానిమీద అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఆ తరువాత కొన్ని రోజులకు మంచు విష్ణు ఒక వీడియో తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ 'హౌస్ అఫ్ మంచుస్' #HouseOfManchus అనే రియాలిటీ షో వస్తుంది అని ప్రకటించాడు.

ఈ వీడియో లో అప్పుడు మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో క్లిప్పింగ్ తో పాటు, వివిధ టీవీ చానెల్స్ ఆ కథనం మీద ప్రసారం చేసిన చిన్న చిన్న క్లిప్పింగ్స్ ని కూడా దానికి జతపరుస్తూ త్వరలోనే 'హౌస్ అఫ్ మంచుస్', ది బిగ్గెస్ట్ రియాలిటీ షో (The Biggest Reality Show) వస్తోంది అని ప్రకటించాడు. కానీ ఆ తరువాత మళ్ళీ దాని గురించి ప్రస్తావించలేదు.

అయితే కొన్ని రోజుల క్రితం మంచు మనోజ్ ఒక వీడియో సాంగ్ ని విడుదల చేసాడు. మనోజ్ వివాహం భూమా మౌనిక (Bhuma Mounica) తో రెండు నెలల క్రితం జరిగింది. ఆ వివాహంలో అన్న విష్ణు ఏదో కనిపించామా అన్నట్టు కనిపించాడు. కానీ ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్టుగా కనపడలేదు. ఇప్పుడు మనోజ్ విడుదల చేసిన ఆ వీడియో పాటలో కూడా తన వివాహానికి సంబంధించిన సన్నివేశాలు అన్నీ చాలా అందంగా చూపించాడు. అలాగే పాట కూడా బాగుంది. కుటుంబ సభ్యులు అందరికీ ప్రాధాన్యం ఇచ్చి చూపించిన ఈ వీడియోలో, విచిత్రం ఏంటి అంటే విష్ణుని కేవలం మూడు నాలుగు సెకన్లు మాత్రమే ఒక షాట్ లో మాత్రమే చూపించారు.

మంచు బ్రదర్స్ (Manchu Brothers) వివాదం తరువాత ఈ వీడియో విడుదల అయింది. కానీ ఇందులో విష్ణు కి అస్సలు ప్రాధాన్యం ఇవ్వలేదు, అంటే అన్నదమ్ముల మధ్య వివాదం ముగిసిపోలేదు, ఇంకా అలానే వుంది అన్నట్టుగా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది కూడా అదే అభిప్రాయానికి వస్తున్నారని తెలిసింది. అయితే ఒక పక్క విష్ణు 'హౌస్ అఫ్ మంచుస్' అని ప్రకటించాడు, ఇంకో పక్క మనోజ్ ఏమో విష్ణు ని పట్టించుకోవటం లేదు, మరి ఈ వివాదం ఇలాగె కొనసాగుతోందా, లేదా ఇద్దరి మధ్య సయోధ్యకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే విషయం పరిశ్రమలో కొంతమందికి వచ్చిన సందేహం.

Updated Date - 2023-04-19T19:26:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!