సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mamta Mohandas: తోటి హీరోయిన్‌ విషయంలో ఇలా చేస్తారా?

ABN, First Publish Date - 2023-03-10T14:53:10+05:30

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) పై మమతా మోహన్‌దాస్‌ (Mamatha Mohandas Shocking comments) షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. పరోక్షంగా ఆమెపై విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara) పై మమతా మోహన్‌దాస్‌ (Mamatha Mohandas Shocking comments) షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. పరోక్షంగా ఆమెపై విమర్శలు చేశారు. ఓ సినిమా విషయంలో నయన్‌ కోసం చిత్రబృందం చేసిన పని వల్ల తాను ఎంతో బాధపడినట్లు చెప్పారు. టైట్‌ షెడ్యూల్‌లో నాలుగు రోజులు వృథా చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

‘‘సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajanikanth) నటించిన ఓ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. నాలుగు రోజులు షూటింగ్‌ కూడా చేశాం. అప్పుడే నాకు అర్థమైంది ఆ ఫ్రేమ్‌లో నేను ఉండనని. ఫైనల్‌ కాపీ వచ్చేసరికి నా షాట్స్‌ ఏమీ లేవు. కేవలం ఒకేఒక్క షాట్‌ ఉంది. అది కూడా ఎక్కడో వెనక నుంచి కనిపిస్తా. నాకు చెప్పినట్లు పాటను చిత్రీకరించలేదు. ఆ సినిమాలో ఎవరైతే హీరోయిన్‌గా నటించారో ఆమె వల్లే ఇదంతా జరిగినట్లు తెలిసినవాళ్ల ద్వారా కాస్త లేట్‌గా తెలిసింది. ఆ పాటలో మరో హీరోయిన్‌ ఉందనే సమాచారం సదరు హీరోయిన్‌కు ఇవ్వలేదట. వేరే హీరోయిన్‌ ఉంటే ఆమె షూట్‌కు రానని ఆమె చెప్పిందట. అందుకు అప్పుడు నా పార్ట్‌ చిత్రీకరించలేదు. ఈ విషయాన్ని సన్నిహితులు చెప్పారు. దీని వల్ల నాలుగు రోజులు నా విలువైన సమయం వఽృథా అయింది. అయితే అందులో నేను కనిపించలేదు అనే బాధ కంటే సాటి నటి మరో నటి పట్ల ఇలా ఉంటారా అని తెలిసి చాలా బాధపడ్డాను’’ అని అన్నారు మమతా మోహన్‌దాస్‌. (Mamata Mohandas indirectly commented on Nayanthara)

రజనీకాంత్‌ - నయనతార జంటగా ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’, ‘దర్బార్‌’ చిత్రాల్లో నటించారు. కథానాయికుడు చిత్రంలో మమతా మోహన్‌దాసు కూడా నటించారు. ఇందులోని ‘దేవుడే స్వర్గం నుంచి’ అనే పాటలో ఆమె ఓ చోట కనిపించారు. ఆ పాటలో ఆమె సరిగా కనిపించకపోవడానికి కారణం నయన్‌ అంటూ పరోక్షంగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం మమతా మాటలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2023-03-10T15:26:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!