సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pawan kalyan-Mallareddy: హారీశ్‌ శంకర్‌ గంటన్నర బతిమలాడారు!

ABN, First Publish Date - 2023-03-26T14:10:39+05:30

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) సినిమాలో తనను విలన్‌గా నటించమని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కోరారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) సినిమాలో తనను విలన్‌గా నటించమని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కోరారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) అన్నారు. ఆ పాత్ర కోసం తనని గంటన్నరసేపు బతిమలాడినా అంగీకరించలేదని ఆయన అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘మేమ్‌ ఫేమస్‌’ (Memu Famous Teaser) టీజర్‌ విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘మద్యపానం, ధూమపానం, పబ్‌లకు తిరగడం, డ్రగ్స్‌ తీసుకోవడం, షికార్లు చేయడం, అమ్మాయి వెంట పడడం లాంటివి చేస్తే ఎవరూ ఫేమస్‌ కారు. ఎదగాలంటే కష్టపడాలి. నేను ఎదగాడానికి ఎన్నో చేశా. పాలు అమ్మిన, పూలమ్మిన.. కాలేజీలు పెట్టా, వాటి ద్వారి టాప్‌ డాక్టర్లను, సైంటిస్టులను, ఇంజనీర్‌లను తయారు చేశాను.. అదీ ఫేమస్‌ కావడం అంటే. యువత కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. ఒకప్పటితో పోల్చితే నేటితరం యువతకు అవకాశాలు ఎక్కువ ప్లానింగ్‌ పర్ఫెక్ట్‌గా ఉండాలంటే. ఎవరికీ సక్సెస్‌కు షార్ట్‌ కట్‌ లేదు. ఈ సినిమా టీజర్‌ బావుంది. సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా ఈ హీరోతో నేనొక సినిమా చేస్తా. ఎన్నికలు పూర్తయిన తర్వాత తెలంగాణ యాసలో ఏడాదికి నాలుగు చిత్రాలు నిర్మిస్తా. అంతా తెలంగాణా మోడల్‌లోనే! ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో సినిమా తీస్తున్న దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (mallaredy reject Pawan movie) మా ఇంటికి వచ్చాడు. ఆ సినిమాలో విలన్‌గా చేయమని గంటన్నర బతిమిలాడాడు. నేను చేయనని చెప్పాను’’ అని అన్నారు.

Updated Date - 2023-03-26T15:28:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!