సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

#SSMB28: మహేష్, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు అంటే

ABN, First Publish Date - 2023-01-02T15:50:06+05:30

మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం తన కుటుంబం తో విదేశాల్లో విహరిస్తున్నాడు. మహేష్ బాబు తదుపరి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (director Trivikram) సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి చేస్తాడు అనే విషయం లో ఒక క్లారిటీ కనపడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం తన కుటుంబం తో విదేశాల్లో విహరిస్తున్నాడు. మహేష్ బాబు తదుపరి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (director Trivikram) సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి చేస్తాడు అనే విషయం లో ఒక క్లారిటీ కనపడుతోంది. (Mahesh Babu is presently holidaying in Switzerland) మహేష్ బాబు జనవరి 6 వ తేదీన హైదరాబాద్ వస్తున్నాడు అని తెలిసింది. (Arriving on January 6) ఆ తరువాత జనవరి 8 వ తేదీన అతని అన్న రమేష్ బాబు (Ramesh Babu's death anniversary) సంవత్సర తిధి లో పాల్గొంటాడని, దీనికి ఘట్టమనేని కుటుంబ సభ్యులు అందరూ హాజరు అవుతారని తెలిసింది. బహుశా ఈ ఫంక్షన్ ఎఫ్.ఎన్.సి.సి. లో గానీ, రామోజీ ఫిలిం సిటీ లో గానీ ఉండొచ్చు అని చెప్తున్నారు.

ఈ ఫంక్షన్ అయినా మరునాడే అంటే జనవరి 9 (Shoot starts from January 9 onwards) నుంచి మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో షూటింగ్ లో పాల్గొంటాడు అని తెలిసింది. ఈ షూటింగ్ మూడు రోజులు ఉంటుంది అని, తరువాత మళ్ళీ సంక్రాంతి పండగ అయ్యాక ఉండొచ్చు అని తెలిసింది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ జనవరి 15 నుంచి మహేష్ షూటింగ్ మొదలెట్టొచ్చు అని తెలిసింది. సితార ఎంటర్ టైన్ మెంట్ వంశీ మహేష్ బాబు తో, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో టచ్ లో వున్నాడు అని, షూటింగ్ కి కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడని కూడా తెలిసింది. పూజ హెగ్డే (Pooja Hegde) ఇందులో కథానాయికగా నటిస్తుండగా, సంయుక్త మీనన్ (Samyukta Menon) కూడా ఇంకుతో పాత్రలో కనిపించనుందని తెలిసింది.

Updated Date - 2023-01-02T15:50:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!