కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srimanthudu: ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్

ABN, First Publish Date - 2023-09-08T14:04:32+05:30

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘శ్రీమంతుడు’. 8 సంవత్సరాల క్రితం (2015లో) విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నిర్మించారు. ఈ సినిమా యూట్యూబ్‌లో 200 M+ వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఇప్పుడు రికార్డ్‌ను క్రియేట్ చేసింది.

Srimanthudu Movie Still

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘శ్రీమంతుడు’ (Srimanthudu). 8 సంవత్సరాల క్రితం (2015) విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాతలు నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘నాన్-బాహుబలి’ హిట్‌గా అప్పట్లో రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు అంటే దాదాపు 8 సంవత్సరాల తర్వాత ‘శ్రీమంతుడు’ చిత్రం మరో అరుదైన ఘనత‌ను సాధించింది. అదేంటంటే..

యూట్యూబ్‌లో 200 M+ వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్ సృష్టించింది. యూట్యూబ్‌లో హయ్యస్ట్ వ్యూస్‌తో పాటు అత్యధికంగా ఇష్టపడిన తెలుగు చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్‌తో పాటు మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీమంతుడు గ్రామ దత్తత నేపధ్యంలో కొరటాల శివ రూపొందించారు. తండ్రి జన్మించిన గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆదర్శవంతమైన యువకుడి కథ ఇది. ఈ సినిమా గ్రామాల ప్రాముఖ్యతను, మానవీయ విలువలను నేర్పుతుంది. (Srimanthudu Creates Youtube Record)


మైత్రీ మూవీ మేకర్స్‌కు తొలి ప్రొడక్షన్ వెంచర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రంలో శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటించగా రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, సుకన్య, తులసి వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా విరజిల్లుతున్న విషయం తెలిసిందే. కాగా.. ‘శ్రీమంతుడు’ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలియంది కాదు.


ఇవి కూడా చదవండి:

============================

*Rules Ranjann Trailer: గంట లేదు, అరగంట లేదు.. ఎక్కడో విన్నట్టుందే..

**********************************

*Jailer Fame Marimuthu: గుండెపోటుతో ‘జైలర్’ యాక్టర్ కన్నుమూత

**********************************

*Vetrimaaran: ‘ఇండియా’ అనే పేరే చాలు

**********************************

*Atlee: ‘జవాన్‌’తో కల నెరవేరింది.. టాలీవుడ్‌లోని ఆ హీరోలతో టచ్‌లోనే ఉన్నా..

************************************

*Kushi: విజయ్ దేవరకొండ, సమంతల ‘ఖుషి’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా?

***********************************

Updated Date - 2023-09-08T14:04:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!