సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mahesh - Namrata Wedding Anniversary: ‘ఇప్పటికి 18 ఏళ్లు.. జీవితాంతం ఇలాగే’

ABN, First Publish Date - 2023-02-10T11:44:53+05:30

టాలీవుడ్‌లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేష్ బాబు (Mahesh Babu) - నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) జంట ఒకటి. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటయిన జంటల్లో వీరు కూడా ఉన్నారు.

Mahesh - Namrata
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మహేష్ బాబు (Mahesh Babu) - నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) జంట ఒకటి. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటయిన జంటల్లో వీరు కూడా ఉన్నారు. ‘వంశీ’ (Vamsi) సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్‌ దాదాపు నెల రోజుల పాటు న్యూజిలాండ్‌‌లో జరగింది. ఆ సమయంలో మహేష్ - నమ్రత మధ్య మంచి స్నేహం కుదిరింది. అనంతరం ఆ స్నేహం ప్రేమగా మారింది.

సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు త్వరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్‌-నమ్రత రిలేషన్‌‌షిప్ మాత్రం బయటపడకపోవడం విశేషం. దాదాపు నాలుగైదేళ్లు ప్రేమని ఎంజాయ్ చేసిన ఈ జంట చివరికి ఇంట్లో చెప్పేశారు. అయితే మహేష్ సోదరి మంజులనే వారి కుటుంబ సభ్యులను ఒప్పించిదట. అలా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా 2005 ఫిబ్రవరి 10న మహేష్- నమ్రత ఒక్కటయ్యారు. ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్‌ బై చెప్పేసింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. ఇక సెలబ్రిటీల జీవితాల్లో ఎన్నో చిక్కులు, చికాకులు ఉంటాయని అంటుంటారు.. అయితే అలాంటి వాటికి ఈ జోడీ ఎంతో దూరం అని నిరూపించింది. అంతేకాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ జంట ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని వ్యక్తం పరుస్తూ ఉంటుంది. కాగా వీరికి గౌతమ్ (Gautam), సితార (Sithara) అనే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా మహేష్ కుటుంబంతో కలిసి టూర్స్ ఎంజాయ్ చేస్తుంటారు.

ప్రేమ పెళ్లి గురించి ‘ఒపెన్ హార్ట్ విత్ ఆర్కే’ షోలో మహేశ్ మాట్లాడాడు. ‘సినిమా చేస్తున్నప్పుడు మా మధ్య స్నేహం కుదిరింది. ఆ ప్రయాణంలోనే ఆ స్నేహం ప్రేమగా మారింది. నాలుగైదేళ్లకి నా కుటుంబానికి నా ప్రేమ విషయం చెప్పాను. తర్వాత అంత స్మూత్‌గా సాగిపోయింది. నాన్నకి నా మీద మొదటి నుంచి చాలా నమ్మకం. నేను మంచి నిర్ణయాలే తీసుకుంటానని ఆయనకి తెలుసు. అందుకే వెంటనే ఒప్పేసుకున్నారు’ అని మహేశ్ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోని మహేశ్ ఫ్యాన్ ఒకరు ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది.


ఇకపోతే ఈ రోజు మహేశ్ - నమ్రత పెళ్లి రోజు. ఈ ఏడాదితో వీరి బంధానికి 18 ఏళ్లు నిండాయి. దీంతో తన భార్య నమ్రతాకి శుభాకాంక్షలు తెలుపుతూ మహేశ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ని షేర్ చేశాడు. అందులో.. ‘ఇద్దరి ప్రయాణంలో 18 ఏళ్లు గడిపోయాయి. జీవితాంతం ఇలాగే కొనసాగుదాం. హ్యాపీ యానివర్సరీ ఎన్‌ఎస్‌జీ’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో ఎంతోమంది నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-10T12:03:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!