Mahesh Babu: కూతురు సితార కి అలియా భట్ ఏమి పంపిందో చూసారా
ABN, First Publish Date - 2023-04-21T17:52:38+05:30
మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని, బాలీవుడ్ నటి అలియా భట్ కి ఎందుకు థేంక్ యు చెప్పింది. వాళ్ళిద్దరికే ఎలా పరిచయం, అదెలా అంటే...
మహేష్ బాబు (Mahesh Babu) ఒక సూపర్ స్టార్, అతని కూతురు సితార ఘట్టమనేని (Sitara Ghattamaneni) ఇంకా స్కూల్ లో చదువుకుంటూ వుంది, కానీ ఆమె అప్పుడే స్టార్ డమ్ సంపాదించేసింది. మహేష్ బాబు #SSMB భార్య నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) తర్ఫీదు అలాంటిది మరి. సితార ఆమధ్య మహేష్ బాబు పాటకి డాన్స్ చేసి అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. అలాగే ఒక ప్రైవేట్ ఛానల్ లో తండ్రి మహేష్ బాబు తో పాటు వచ్చి ఒక డాన్స్ షో లో కూడా పాల్గొంది.
ఆమె ఎంత పాపులర్ అనటానికి ఆమెకి ఇన్స్టాగ్రామ్ లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ వున్నారంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి సితార ఇప్పుడు వార్తల్లో వుంది. ఆమెకి బాలీవుడ్ అగ్ర నటీమణుల్లో ఒకరయిన అలియా భట్ (Alia Bhatt) కి ఏంటి సంబంధం. ఏంటంటే అలియా భట్ ఆమధ్య ఒక బట్టలకు సంబంధించి వ్యాపారం మొదలెట్టింది కదా, చాలా స్టోర్స్ కూడా ఓపెన్ చేసింది. అందులో భాగంగా సితారకి కొన్ని బట్టలు పంపింది అలియా భట్. అదే గిఫ్ట్ ఇచ్చింది.
అలా గిఫ్ట్ గా వచ్చిన బట్టలు వేసుకొని సితార ఇవి ఎంతో బాగున్నాయి అంటూ అలియా భట్ కి థేంక్ యు చెపుతూ మీ కుటుంబం లో నన్ను కూడా కలుపుకున్నారు అని పెట్టింది. అవన్నీ నాకు చాలా నచ్చాయి, చాలా హ్యాపీ గా వుంది అని కూడా చెప్పింది. ఆ బట్టలు వేసుకున్న సితార ఎంతో క్యూట్ గా వుంది కూడా. నెటిజన్స్ తో పాటు తల్లి నమ్రత కూడా ఆ బట్టల్లో సితారని చూసి ఎంతో మురిసిపోతోంది.