సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sitara Ghattamaneni: ‘తండ్రిలాగే కూతురు’.. నాన్న ఫౌండేషన్‌కి పాకెట్‌ మనీ డొనేట్ చేసిన సితార

ABN, First Publish Date - 2023-01-02T11:10:34+05:30

టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు సితార (Sithara). మహేశ్ బాబు (Mahesh Babu) తనయురాలిగా మాత్రమే కాకుండా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

Mahesh babu and Sithara
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అక్కరలేని పేరు సితార (Sithara). మహేశ్ బాబు (Mahesh Babu) తనయురాలిగా మాత్రమే కాకుండా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఘట్టమనేని వారసురాలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడూ తనకి సంబంధించిన విషయాలను ఘట్టమనేని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. మహేశ్ బాబు కుటుంబం ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉంది. ఆ కుటుంబం న్యూ ఇయర్ (New Year) సెలబ్రేషన్స్ అక్కడే జరుపుకుంది. అయితే చిన్న పిల్లల కోసం మహేశ్ బాబు ఫౌండేషన్ (Maheshbabu Foundation) ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

కొత్త సంవత్సరం రోజున మహేశ్ బాబు ఫౌండేషన్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ని ప్రారంభించారు. దీనికి సంబంధించి వివరాలు చెబుతూ ఆ ఫౌండేషన్ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ ఫౌండేషన్ గురించి సితార మాట్లాడింది. ‘http://maheshbabufoundation.org కి సంబంధించి అధికారిక వెబ్‌‌సైట్‌ని లాంచ్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. నాన్న ఫౌండేషన్‌లో భాగం కావాలని అనుకున్నాను. దానికి ఇదే నా అవకాశంగా భావించి ఈ నెల నా పాకెట్‌ మనీని డోనేట్ చేస్తున్నాను. మీరు కూడా చేయండి. మనందరం కలిసి పిల్లల కోసం మంచి స్థలాన్ని క్రియేట్ చేద్దాం’ అని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాంతో మహేశ్ బాబుతో పాటు సితారపై కూడా వారి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘తండ్రిలాగే కూతురు కూడా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-01-02T11:10:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!