Madhavi Latha: నా జీవితం.. నేనే నిర్ణయం తీసుకుంటా!
ABN, First Publish Date - 2023-06-01T20:05:52+05:30
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు ‘నచ్చావులే’ ఫేం మాధవీలత. తరచూ అభిమానులతో కొత్త విషయాలను షేర్ చేసుకుంటారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తుంటారు. కొందరు నెటిజన్లు టార్గెట్ చేసిన అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో దీటుగా సమాధానమిచ్చారు.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు ‘నచ్చావులే’ ఫేం మాధవీలత. తరచూ అభిమానులతో కొత్త విషయాలను షేర్ చేసుకుంటారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తుంటారు. కొందరు నెటిజన్లు టార్గెట్ చేసిన అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో దీటుగా సమాధానమిచ్చారు. ఇటీవల ఓ నెటిజన్ ఆమెను ట్యాగ్ చేసి ‘మీ పెళ్లిపై వస్తున్న వార్తలు నిజమేనా.. పెళ్లెప్పుడు చేసుకుంటారు’ అంటూ పోస్ట్ చేశారు. దానికి మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘‘అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వయసు ఒక్కటే సరిపోదు. దానికి ఆమె మానసికంగా, శారీరకంగానూ సిద్థంగా ఉండాలి. అది పూర్తిగా ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నేను ఇప్పుడు పెళ్లికి సిద్థంగా లేను. భవిష్యత్తులోనూ దానిపై క్లారిటీ చెప్పలేను. ఇది నా జీవితం.. నేనే నిర్ణయం తీసుకుంటాను’’ అని చెప్పింది. ఆమె సమాధానానికి కొందరు ప్రశంసిస్తుంటే.. కొందరు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్లో ‘నచ్చావులే’, స్నేహితుడా, అరవింద్ 2 చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత కూడా అడపాదడపా సినిమాల్లో అవకాశం అందుకున్నా.. ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు.