Tamil Remake: తెలుగు.. హిందీ స్టార్లు.. ఓ మల్టీస్టారర్
ABN, First Publish Date - 2023-04-06T16:44:32+05:30
తెలుగు సినిమా స్థాయి దినదినాభివృద్ధి చెందుతుంది. పొరుగింటి నటులు, (Tamil remake) మేకర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
తెలుగు సినిమా స్థాయి దినదినాభివృద్ధి చెందుతుంది. పొరుగింటి నటులు, (Tamil remake) మేకర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా హిందీ హీరోల నుంచి ఈ ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో తెలుగులో రూపొందిన చాలా చిత్రాలు ఉత్తరాదిలో సూపర్ సక్సెస్ కావడమే అందుకు కారణమని చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది తెలుగు స్టార్స్ బాలీవుడ్ సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే(Telugu Stars in bollywood)! హృతిక్ రోషన్ ‘వార్ 2’లో జూనియర్ ఎన్టీఆర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా సౌత్ హీరో, దర్శకుడితో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. రవితేజ, హిందీ హీరో వరుణ్ ధావన్ (Varun Dhavan) హీరోలుగా ఓ సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శింబు (Simbhu) కథానాయకుడిగా వెంకట్ ప్రభు (Venkat prabhu) దర్శకత్వం వహించిన తమిళ సూపర్ హిట్ ‘మానాడు’కు (Maanadu) రీమేక్ అని సమాచారం. ప్రవీణ్ సత్తారు (Praveen sattaru to Direct Maanadu) ఈ సినిమాకు దర్శకుడు. అయితే హిందీలో తీయబోయే చిత్రంలో ఎస్.జె. సూర్య చేసిన పాత్రను మాస్‌మహారాజా రవితేజ(Ravi teja), శింబు చేసిన క్యారెక్టర్‌ను వరుణ్‌ధావన్ చేయనున్నారని బాలీవుడ్ మీడియా నుంచి వచ్చిన సమాచారం. రానా దగ్గుబాటి(Raana Daggubabti), ఏషియన్ సునీల్ నారంగ్ నిర్మాణంలో ‘మానాడు’ హిందీ రీమేక్ రూపొందుతోంది. వరుణ్ ధావన్ మినహా ఇతర హీరో, దర్శక - నిర్మాతలు తెలుగువారే కావడం విశేషం. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో ‘గాండీవధారి అర్జున’ తెరకెక్కిస్తున్నారు. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో బిజీగా ఉన్నారు. వరుణ్ ధావన్ హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయా చిత్రాల షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూట్ చేస్తారని, దాంతోపాటు నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించనున్నారని సమాచారం.