సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varun Tej: మా ఊరి పొలిమేర‌-2 టీజర్‌ చూసిన మెగా ప్రిన్స్ స్పందనిదే..

ABN, First Publish Date - 2023-07-03T22:08:50+05:30

స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను ముఖ్య పాత్ర‌ల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’. శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యానర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మించారు. డా.అనిల్ విశ్వ‌నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజర్‌ని మెగా ప్రిన్స్ తాజాగా విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Maa Oori Polimera 2 Team with Varun Tej
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యానర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ (Gowri Kriesna) నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’ (Maa Oori Polimera-2). డా.అనిల్ విశ్వ‌నాథ్ (Dr. Anil Vishwanath) ద‌ర్శ‌కుడు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మవుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ను మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

టీజర్ విడుదల అనంతరం మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Mega Prince Varun Tej) మాట్లాడుతూ.. సత్యం రాజేష్ నాకు మంచి మిత్రుడు. ఓటీటీలో త‌ను న‌టించిన‌ ‘మా ఊరి పొలిమేర‌’ (Maa Oori Polimera) చూశాను. చివరిలో ట్విస్ట్ అదిరిపోయింది. నాకు చాలా బాగా న‌చ్చింది. దానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘మా ఊరి పొలిమేర‌-2’ టీజ‌ర్ కూడా చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. మొద‌టి పార్ట్‌లా సెకండ్ పార్ట్ కూడా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నానని అన్నారు.

న‌టుడు స‌త్యం రాజేష్ (Satyam Rajesh) మాట్లాడుతూ.. మా సినిమా టీజ‌ర్ లాంచ్ చేసి సినిమా‌పై మ‌రింత హైప్ పెంచిన వ‌రుణ్ తేజ్‌గారికి మీడియా ముఖంగా నా ధ‌న్య‌వాదాలు. ఇందులో ఒక ఇంపార్టెన్స్ ఉన్న ప‌వ‌ర్‌పుల్ రోల్ చేశాను. మొద‌టి భాగం చేశాక చాలా మంది సెకండ్ పార్ట్ ఎప్పుడూ అంటూ ఎంతో క్యూరియాసిటీ చూపించారు. మొద‌టి పార్ట్ పెద్ద హిట్ట‌యింది. చాలా సంతోషం. ఈ సినిమా కోసం ప‌ది కేజీలు పెరిగాను. స్మ‌శానంలో కొన్ని సీన్స్ చేయాల్సి వ‌చ్చినప్పుడు కొంత భ‌య‌ప‌డ్డాను. ద‌ర్శ‌కుడు, నిర్మాత ఎక్క‌డా కాంప్ర‌జైజ్ అవ్వ‌కుండా సినిమాను చాలా గ్రాండ్‌గా తీశారు. నా న‌ట‌న ఇందులో చాలా న్యాచురల్‌గా ఉంటుంది. న‌టుడుగా న‌న్ను మ‌రో మెట్టు ఎక్కించే చిత్ర‌మ‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఇందులో కామాక్షి న‌ట విశ్వ‌రూపం చూస్తారని తెలిపారు.

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ఒక మంచి సినిమా ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొద‌టి పార్ట్ పెద్ద హిట్ట‌యింది. రెండో పార్ట్ కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాము. టీజర్ విడుదల చేసిన వరుణ్ తేజ్‌గారికి ధన్యవాదాలు. ఈ పార్ట్‌లో ప‌ద్మ‌నాభ స్వామి టెంపుల్ అంశాన్ని కూడా లైట్‌గా ట‌చ్ చేసే ప్ర‌య‌త్నం చేశాము. అది ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇది మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో సాగే చిత్రం. అందులో బ్లాక్ మ్యాజిక్ అనే అంశాన్ని జోడించాము. ఈ నెలాఖ‌రులో కానీ ఆగ‌స్ట్ మొద‌టి వారంలో కానీ సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. (Maa Oori Polimera-2 Teaser Launch)

ఇవి కూడా చదవండి:

**************************************

*Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. ‘ఆదిపురుష్’ శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

*Bharatheeyans: మనం చైనాకు లొంగిపోతున్నామా?.. ‘భారతీయన్స్’ నిర్మాత ఆవేదన

**************************************

*Animal: ‘యానిమల్’ వాయిదా.. కారణం చెప్పిన ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు

**************************************

*Anushka Shetty: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి అనుష్క సినిమా..

**************************************

*Bandla Ganesh: పవర్‌స్టార్‌ పేరు చెప్పుకుని లబ్ధి పొందను.. నా చూపు, నా ఆశ ఒకటే..

**************************************

*Sudigali Sudheer: ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం.. నిజమేనా?

**************************************

Updated Date - 2023-07-03T22:08:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!