M Venkaiah Naidu: ‘భారతీయన్స్’.. భారతీయులంతా ఈ సినిమా చూడాలి
ABN, First Publish Date - 2023-04-16T18:15:24+05:30
ప్రతి భారతీయుడు రియల్ హీరో. సామాన్య స్త్రీ మదర్ ఆఫ్ ఇండియా. భారతీయులు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న ఫిలాసఫీని
‘దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథను తెలియజేస్తూ ఇటువంటి మంచి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయం’ అని అన్నారు భారత మాజీ ఉప రాష్ట్రపతి (Former Vice President) ఎం. వెంకయ్య నాయుడు (M Venkaiah Naidu). నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ హీరోలుగా.. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన సినిమా ‘భారతీయన్స్’ (Bharateeyans). భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ప్రముఖ రచయిత - ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (Deena Raj) (‘ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా’ ఫేమ్) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. ప్రీమియర్ అనంతరం చాలా మంచి సినిమా తీశారని చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ప్రోత్సహించాలన్నారు. (M Venkaiah Naidu watches Bharateeyans)
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించి ఇటువంటి మంచి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయం. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందిస్తున్నారు. చాలా సంతోషం. దేశభక్తి చిత్రాలను యువత, ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు, దర్శక - నటుడు కాశీ విశ్వనాథ్ (Kasi Viswanath) మాట్లాడుతూ.. నేను ఇంతకు ముందు సినిమా చూశా. వెంకయ్య నాయుడుగారు చూస్తున్నారని తెలిసి మళ్లీ వచ్చా. దేశంలోని గొప్ప నాయకులలో ఆయన ఒకరు. సమాజానికి, మన దేశానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటేనే సినిమాలను ప్రోత్సహించడానికి వస్తారు. ఆయన సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దర్శక నిర్మాతల్లో ఎంతో దేశభక్తి ఉంటేనే ఇటువంటి సినిమాలు వస్తాయి. మంచి కాన్సెప్ట్ ఇది. తప్పకుండా ప్రేక్షకులు అందరూ సినిమా చూడాలని అన్నారు.
నిర్మాత డా. శంకర్ నాయుడు అడుసుమిల్లి (Dr. Shankar Naidu Adusumilli) మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసి మమ్మల్ని అభినందించిన వెంకయ్య నాయుడుగారికి థాంక్స్. ఆయన మాటలు మాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. నా దృష్టిలో ప్రతి భారతీయుడు రియల్ హీరో. సామాన్య స్త్రీ మదర్ ఆఫ్ ఇండియా. భారతీయులు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న ఫిలాసఫీని ‘భారతీయన్స్’ ద్వారా గుర్తు చేస్తున్నాం. ఇది పాన్ ఇండియా సినిమా. మేలో అన్ని భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలుపగా.. దర్శకుడు దీనరాజ్ (Director Deena Raj) మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్ అయినా వెంకయ్య నాయుడుగారు సినిమా చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దర్శకుడిగా నాకు మొదటి సినిమా ఇది. దీని కంటే ముందు పలు చిత్రాలకు రచయితగా పని చేశా. ‘కలిసుందాం రా’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘ప్రేమించుకుందాం రా’ తదితర హిట్ సినిమాలకు వర్క్ చేశా. దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. శంకర్‌గారు అమెరికాలో డాక్టర్. కథ నచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని గుర్తు చేసే, పెంపొందించే చిత్రమిదని అన్నారు. ఇంకా హీరోహీరోయిన్లు మాట్లాడుతూ.. మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
*********************************
*Box Office: బావలు కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే!
*Rakul Preet Singh: రకుల్ రీ ఎంట్రీ సాధ్యమేనా?
*Shaakuntalam: ఇక అల్లు అర్జున్ ఫ్యాన్సే.. ఈ ప్రోమో అర్థం అదేనా?
*Vetrimaaran: ‘విడుదల’కు పాజిటివ్ టాక్.. ఛాన్స్ ఇచ్చే టాలీవుడ్ హీరో ఎవరు?