Lavanya Tripathi: అనుకున్న విధంగానే.. పెళ్లి చేసుకున్నాం: లావణ్య పోస్టు వైరల్
ABN, First Publish Date - 2023-11-20T10:02:30+05:30
వివాహం అనంతరం లావణ్య త్రిపాఠి తొలిసారి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. 7 సంవత్సరాల ప్రేమ అనంతరం వరుణ్ తేజ్,లావణ్య జంట నవంబర్ 1న ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల అనంతరం లావణ్య తొలిసారిగా వరుణ్ తేజ్ గురించి కొన్ని మాటలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.
వివాహం అనంతరం లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తొలిసారి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. 7 సంవత్సరాల ప్రేమ అనంతరం వరుణ్ తేజ్ (Varun Tej) ,లావణ్య జంట నవంబర్ 1న ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఈ జంట హెదరాబాద్లో దీపావళి సంబురాలు చేసుకున్నారు.
ఈ వేడుకల అనంతరం లావణ్య తొలిసారిగా వరుణ్ తేజ్(VarunTej) గురించి కొన్ని మాటలు చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ‘ఎంతో అమేజింగ్, కేరింగ్, ప్రేమ ఉన్న వ్యక్తి ఇప్పుడు నా భర్త అని, ఇప్పుడు నాకు ఎంతో చెప్పాలని ఉంది కానీ మా ఇద్దరి మధ్యే ఉంచాం. మూడు రోజుల పెళ్లి, ప్రతిదీ మేం అనుకున్న విధంగానే కుటుంబ సభ్యులు, దగ్గరి వారి సమక్షంలో ఘనంగా జరిగిందని, వేడుకకు హజరై తమ దీవెనలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. మీ అశీస్సులు చిరకాలం ఉండాలి’ అంటూ తన పెళ్లి ఫొటోలను జత చేసింది.
అయితే లావణ్య (Lavanya Tripathi ) తాజా పోస్టుతో మరోసారి వీరి వివాహం ట్రెండింగ్లోకి వచ్చింది. అభిమానులంతా మరోసారి ఆ ఫొటోలను చూస్తు అశీర్వాదాలు తెలుపుతున్నారు. వరుణ్ (VarunTej) లావణ్య పెట్టిన పోస్టుకు లవ్ ఎమోజీతో కామెంట్ చేశారు. మీరూ ఓ లుక్కేయండి.