కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Laksh08: శేఖర్ సూరితో లక్ష్ చదలవాడ ప్రాజెక్ట్‌.. కాన్సెప్ట్ పోస్టర్ వదిలారు

ABN, First Publish Date - 2023-10-10T18:40:37+05:30

టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారారు. ‘వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన లక్ష్.. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధీర’తో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ సూరితో లక్ష్ చేయనున్న చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Laksh Chadalavada and Shekkhar Suri Film Poster

టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడ (Laksh Chadalavada) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోగా మారారు. ‘వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన లక్ష్.. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధీర’ (Dheera)తో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు. తాజాగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. లక్ష్ చేస్తున్న మరో కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ వదిలారు.

లక్ష్ 8వ (Laksh08) చిత్రంగా తెరకెక్కబోతోన్న ఈ ప్రాజెక్ట్ డిటైల్స్‌తో పాటు చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ (A Film By Aravind) ఫేమ్ శేఖర్ సూరి (Shekkhar Suri) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ (Chadalavada Brothers) సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ (STTV Films) బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పోస్టర్‌తోనే సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.


ఈ కాన్సెప్ట్ పోస్టర్ విషయానికి వస్తే.. హీరో హీరోయిన్లు ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలా రోడ్డు మీద వెళుతుండగా.. అగ్నిజ్వాలలు చెలరేగి.. అది కాస్త మేఘాల్లా మారి.. మెదడు ఆకారంలోకి రావడం చూస్తుంటే.. ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా అనిపిస్తోంది. మెదడుకు మేత పెట్టేలా సినిమా ఉంటుందనిపిస్తోంది. దర్శకుడు శేఖర్ సూరి సినిమాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు కాబట్టి.. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చేదిగా ఉంటుందని డిసైడ్ అయిపోవచ్చు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. (Laksh08 Concept Poster Out)


ఇవి కూడా చదవండి:

============================

*Bubblegum Teaser: ఆ కిస్సులేంటి? ఆ డైలాగ్స్ ఏంటి? రోషన్ కనకాల రొమాన్స్ అరాచకం అంతే..

***********************************

*Suhas: గృహప్రవేశం టైమ్‌లో కొత్త ఇంటి గోడకు వేసే అచ్చులాంటి సినిమా ఇది నాకు..

************************************

*Fatima Vijay Antony: నీ జ్ఞాపకాలతో చచ్చిపోతున్నా!.. కుమార్తె మృతిపై భావోద్వేగ పోస్ట్

**********************************

*Priyamani: ఓటీటీలో దసరా స్పెషల్‌‌గా ప్రియమణి నటించిన పవర్‌ఫుల్ వెబ్ సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

**********************************

*Raghava Lawrence: ఆడియో ఫంక్షన్లకు అభిమానులు రావొద్దు.. లారెన్స్ సంచలన వ్యాఖ్యలు

*******************************

Updated Date - 2023-10-10T18:40:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!