సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Singer L. R. Eswari: అదీ ఓ పాటేనా.. మార్మోగిన పాటపై సంచలన వ్యాఖ్యలు!

ABN, First Publish Date - 2023-03-07T18:01:18+05:30

భలే భలే మగాడివోయ్‌ బంగారు నా సామివోయ్‌.. లే.. లే.. లే లేలే నా రాజా.. మసక మసక చీకటిలో.. అరే... ఏమిటి లోకం ‘తీస్కో కోకోకోలా.. పాటలు వినగానే గుర్తొచ్చే పేరు సీనియర్‌ గాయని ఎల్‌.ఆర్‌ ఈశ్వరి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘భలే భలే మగాడివోయ్‌ బంగారు నా సామివోయ్‌..(Bhale Bhale magadivoy)

లే.. లే.. లే లేలే నా రాజా..

మసక మసక చీకటిలో..(Masaka masak chikatilo)

అరే... ఏమిటి లోకం

‘తీస్కో కోకోకోలా.. (tisko cococola)

పాటలు వినగానే గుర్తొచ్చే పేరు సీనియర్‌ గాయని ఎల్‌.ఆర్‌ ఈశ్వరి(Singer L. R. Eswari). తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 8 వేలకు పైగా పాటలు పాడారు. 1954లో గాయనిగా కెరీర్‌ ప్రారంభించిన ఆమె విలక్షణమైన స్వరంతో ఆకట్టుకున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

‘కోరస్‌తో నా కెరీర్‌ మొదలైంది. మా ఇంట్లో సంగీతం ఇమిడి ఉంది. అమ్మ కోరస్‌ పాడుతూ ఉండేది. ఆ తర్వాత నేనూ కోరస్‌ పాడటం మొదలుపెట్టాను. ‘సువర్ణ సుందరి’ సినిమాలో ‘పిలువకు రా’ పాటకు కోరస్‌ ఇస్తుంటే నా గొంతు బాలేదని బయటకు గెంటేశారు. ఆ విషయంలో నా కన్నా అమ్మ ఎక్కువగా బాధ పడింది. ‘ఎవరైతే నన్ను బయటకు పొమ్మన్నారో వాళ్లే నా పాటను రికార్డు చేేస రోజు వచ్చేలా చేస్తాను అమ్మా’ అని ఆమెను ఓదార్చాను. ధైర్యంగా ఉన్నాను కానీ అమ్మ బాధ చూసి ఆ సమయంలో నాకూ కన్నీళ్లు ఆగలేదు. సింగర్‌గా నేను మంచి స్థాయికి వచ్చాక అదే రికార్డిస్ట్‌ నేను పాడగా కొన్ని వందల పాటలు రికార్డ్‌ చేశాడు. ఇలాంటివి ఈ జర్నీలో చాలానే చూశా. అయితే గాయనిగా అనుకున్న స్థాయికి చేరుకున్నా. అదే నాకు ఆనందం’’ అని అన్నారు.

ఇప్పుడొస్తున్న పాటలపై ఎల్‌.ఆర్‌ ఈశ్వరి కామెంట్‌ చేశారు. (Singer L. R. Eswari comments on Oo antava mava Song) ఇప్పటి పాటలు అసలు నచ్చడం లేదని అభిప్రాయపడ్డారు. ఇటీవల ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా’ పాట విన్నాను. అసలు అదీ ఒక పాటేనా? ప్రారంభం నుంచి చివరి దాకా ఒకేలా ఉంటుంది. అలాంటి పొరపాట్లు రాకుండా సంగీత దర్శకుడు చూసుకోవాలి కదా? (Singer L. R. Eswari comments on Devisri Prasad) ఇప్పుడిప్పుడే వస్తున్న సింగర్స్‌కి ఏం తెలుసు ఎలా పాడాలో? రికార్డింగ్‌ స్టూడియోలో ఎలా చెబితే అలా పాడతారు. ఆ పాట నా దగ్గరకొచ్చి ఉంటే ఆ కలరే వేరుగా ఉండేది. అదిరి స్టైల్‌ పాట ఫ్లేవర్‌ మార్చేసేదాన్ని. మేము ఎంతో సిన్సియర్‌గా పని చేశాం కాబట్టే అప్పుడు పాడిన పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో ఉన్నాయి. అప్పుడు ఒక్క సినిమా 100, 250 రోజులు ఆడేది. ఇప్పుడు పట్టుమని పది రోజులు ఆడేతే ఎక్కువ’’ అని అన్నారు. (Singer L. R. Eswari comments on Pushps Songs)

Updated Date - 2023-03-07T19:31:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!