kushi: దర్శకుడి అప్‌డేట్.. అంతా సజావుగా ఉంది!
ABN, First Publish Date - 2023-01-30T17:22:33+05:30
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రంపై దర్శకుడు శివ నిర్వాణ అప్‌డేట్ ఇచ్చారు. సమంత తన అనారోగ్యం గురించి బయటపెట్టినప్పటి నుంచి ఈ సినిమాపై ఎన్నో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
సమంత(samantha), విజయ్ దేవరకొండ (Vijay devarakonda) జంటగా నటిస్తున్న ‘ఖుషి’ (kushi)చిత్రంపై దర్శకుడు శివ నిర్వాణ (shiva nirvana)అప్‌డేట్ ఇచ్చారు. సమంత తన అనారోగ్యం గురించి బయటపెట్టినప్పటి నుంచి ఈ సినిమాపై ఎన్నో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సామ్ ఈ చిత్రం నుంచి బయటికొచ్చిందనీ సినిమా ఆగిపోయిందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! ఈ వదంతులకు దర్శకుడు శివ నిర్వాణ చెక్ పెట్టారు. ట్విట్టర్ వేదికగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. అతి త్వరలోనే ‘ఖుషి’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని’ ఆయన తెలిపారు. అంతా సజావుగా జరుగుతుందని ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌తో అభిమానులు ఆనందంతో ఖుషీ అవుతున్నారు. సినిమాకు సంబంధించి కొత్త లుక్ విడుదల చేయాలని నెటిజన్లు దర్శకుణ్ణి కోరారు. త్వరగా షూటింగ్ పూర్తిచేసి టీజర్ విడుదల చేయాలని కోరుతున్నారు.
ఓ కొత్త తరహా ప్రేమ కథతో వినోదాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.