కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kushi: ఉన్నమాట చెబుతాను వినకోండ్రి.. పెళ్లి ఊసు పాడుగానూ మానుకోండ్రి..

ABN, First Publish Date - 2023-08-26T22:52:27+05:30

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ‘ఖుషి’. సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నుంచి ఫిఫ్త్ సింగిల్ ‘ఓసి పెళ్లామా..’ లిరికల్ సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Vijay Deverakonda in Kushi

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’ (Kushi). ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబైంది. తాజాగా ఈ సినిమా నుంచి ఐదో లిరికల్ సాంగ్ ‘ఓసి పెళ్లామా..’ (Osi Pellama)ను మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మేకర్స్ ఈ పాటను విడుదల చేశారు.


పబ్‌లో పార్టీ సాంగ్‌గా ఈ పాటను చిత్రీకరించినట్లుగా.. పాటను చూస్తుంటే తెలుస్తోంది. ఈ పాటకు కూడా డైరెక్టర్ శివ నిర్వాణనే లిరిక్స్ రాయగా.. హేషమ్ అబ్దుల్ వాహాబ్ మరోసారి క్యాచీ ట్యూన్ అందించారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ పాడారు.

‘‘కశ్మీర్‌లో ఫస్ట్ టైమ్ తనను చూసిన,

ముందెనక చూడకుండ మనసిచ్చిన...

బాబు మాట పక్కనెట్టి బయటకొచ్చిన,

లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసిన...’’ అంటూ హీరో తన ప్రేమ, పెళ్లి ప్లాష్ బ్యాక్ గురించి చెబుతూ సాగుతుందీ పాట. ఇంతకు ముందు విడుదలైన పాటల్లానే ఈ పాట కూడా ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Osi Pellama Lyrical Song From Kushi Out)

ఈ పాట విడుదల కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ (Director Shiva Nirvana) మాట్లాడుతూ.. ‘‘నా సినిమా.. థియేటర్‌లో రిలీజై రెండేళ్లు దాటుతోంది. మళ్లీ మీ అందరినీ ఓ మంచి ఎంటర్‌టైనర్‌తో కలుస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మంచి ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూడొచ్చు. మీరు రీపీటెడ్‌గా సినిమాను చూస్తారు. అంత బాగుంటుంది. ఫన్ రైడ్‌లా సినిమా ఉంటుంది. చాలా రోజుల తర్వాత సమంత లవ్ స్టోరీలో నటిస్తుందంటే అందరికీ పండగే. హేషమ్ బ్రో మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు థ్యాంక్స్’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Raghava Lawrence: ‘చంద్రముఖి’గా కంగనా ర‌నౌత్‌ అనగానే భయపడిపోయా..

***************************************

*Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్న ఐకాన్ స్టార్

*****************************************

*Prakash Raj and Bobby Simha: నటులు ప్రకాశ్ రాజ్‌, బాబీ సింహాలకు నోటీసులు

*****************************************

*Kartikeya Gummakonda: నేనలా చెప్పగానే.. 2 నిమిషాల పాటు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు

*****************************************

Updated Date - 2023-08-26T22:52:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!