సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Krithi Shetty: అవకాశాల కోసమేనా అలా..!

ABN, First Publish Date - 2023-07-16T14:39:21+05:30

‘ఉప్పెన’ సక్సెస్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది కృతీశెట్టి. ఆ చిత్రంలో బేబమ్మ అద్భుతమైన నటన కనబర్చి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది. తొలి చిత్రంతోనే సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ బెంగళూరు బ్యూటీ వరుసగా నాలుగైతు చిత్రాల్లో అవకాశాలు అందుకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఉప్పెన’ (Uppena) సక్సెస్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది కృతీశెట్టి(Krithi Shetty). ఆ చిత్రంలో బేబమ్మ అద్భుతమైన నటన కనబర్చి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకుంది. తొలి చిత్రంతోనే సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ బెంగళూరు బ్యూటీ వరుసగా నాలుగైతు చిత్రాల్లో అవకాశాలు అందుకొంది. ఉప్పెన సినిమా తరువాత ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయం అందుకుంది. కానీ ఆ తర్వాత నుంచి అసలు కలిసి రాలేదు. తదుపరి నచించిన ‘ది వారియర్‌’, మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకకు చెప్పాలి’, ‘కస్టడీ’ చిత్రాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం తెలుగులో సరైన ఆఫర్లు లేవు. అందుకే తమిళ చిత్రాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం తమిళంలో జయం రవితో ‘జీనీ’ చిత్రంలో నటిస్తోంది. (Krithi Shetty Photos Viral)

కృతీ సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమెకు 6 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. ఈ వేదికగా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఎప్పుడూ సంప్రదాయబద్దంగా కనిపించే ఈ అమ్మడు ఈ మఽధ్య కాస్త బోల్డ్‌గా తయారైంది. హాట్‌హాట్‌ ఫొటో షూట్‌లతో ఇన్‌స్టాను షేక్‌ చేస్తోంది. తాజాగా కృతీశెట్టి గ్రీన్‌ డ్రెస్‌లో దిగిన ఫొటోలను షేర్‌ చేసింది. కిల్లింగ్‌ లుక్స్‌లో యువతను రెచ్చగొడుతుంది. స్లిమ్‌ ఫిట్‌ అందాలతో యూత్‌ ఎట్రాక్ట్‌ చేస్తోంది. కృతి తాజాగా పెట్టిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అవకాశాలు తగ్గడంతోనే గ్లామర్‌పై దృష్టిపెడుతోందని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-07-16T14:44:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!