సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SuperStarKrishna: మేకప్ మ్యాన్ మాధవరావుకి కృష్ణతో కొన్ని దశాబ్దాలపాటు అనుబంధం, అందుకే ...

ABN, First Publish Date - 2023-05-31T15:19:10+05:30

కృష్ణతో కొన్ని దశాబ్దాల పాటు పర్సనల్ మేకప్ మ్యాన్ గా మాధవరావు కృష్ణ పక్కనే ఉండి అతన్ని చాలా దగ్గరగా చూసిన అతి కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు. అలాగే కృష్ణ మీద 'దేవుడులాంటి మనిషి' పుస్తకం రాసి, అతని జీవిత చరిత్ర గురించి, సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పిన ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ వినాయకరావును కృష్ణ అభిమానులు సన్మానించారు

Thammareddy Bharadwaj, Madhava Rao and Vinayaka Rao
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ కృష్ణ #SuperStarKrishna అంటే డేరింగ్ అండ్ డేషింగ్ అంటారు, ఎందుకో తెలుసా. అతను ఎటువంటి నిర్ణయం సాహసంతో కూడినదే, అందుకనే కృష్ణని ఆలా అంటారు. తెలుగు సినిమాకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, అలాగే మొదటి స్టీరియో సౌండ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70 MM, మొదటి జేమ్స్ బాండ్ సినిమా, మొదటి కౌబోయ్ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసిన కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచుకుంటూ వెళ్లారు. అలంటి కథానాయకుడి జయంతి ఈరోజు, మే 31 May31. అయన జయంతిని పురస్కరించుకుని ఆయన అభిమానులు నిర్మాత, దర్శకుడి తమ్మారెడ్డి భరద్వాజ (ThammareddyBharadwaja) ముఖ్య అతిధి గా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ పర్సనల్ మేకప్ మ్యాన్ మాధవరావుని (MadhavaRao), అలాగే కృష్ణ జీవిత చరిత్ర #DevuduLaantiManishi #Krishna 'దేవుడు లాంటి మనిషి' వ్రాసిన సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావుని (VinayakaRao) అభిమానులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ఇది కృష్ణగారి 81వ పుట్టినరోజు. ఆయన ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఈ పుట్టినరోజును చేసుకునే వాళ్లం. ఇప్పుడు జయంతి జరుపుకుంటున్నాం. ఆయన మన మధ్య లేనప్పటికీ, సినిమాలతోనూ, వ్యక్తిత్వంతోనూ ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు అని ఆయన్ని ఎప్పటికీ మరిచిపోలేము అని చెప్పారు. #HBDEvergreenSuperstarKrishna అలాగే ఆయనకి రూపశిల్పి అయిన మాధవరావుగారిని, ఆయన జీవితాన్ని పుస్తకంగా తెచ్చిన వినాయకరావుగారిని అభిమానులు ఇలా సత్కరించడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. #HBDSuperstarKrishnaGaru అలాగే ఈ పుట్టినరోజు సందర్భంగా కృష్ణ నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ #MosagallakuMosagadu4K చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఆ రోజుల్లోనే ప్రపంచమంతా విడుదలైన సినిమాని ఇప్పుడు కొత్త టెక్నాలజీతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నాము అని అన్నారు తమ్మారెడ్డి.

కృష్ణగారి పర్సనల్ మేకప్ మ్యాన్ మాధవరావు మాట్లాడుతూ, మే 31న కృష్ణగారి పుట్టినరోజును ఆయన ఎక్కడ ఉన్నా కూడా కనుల పండుగగా సెలెబ్రేట్ చేసుకునే వాళ్లం. ఆయన బర్త్‌డే కాదు ఇది, కృష్ణగారి పండుగ. ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతియుతంగా ఉండాలని, సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన బతికే ఉంటారని చెప్పారు.

సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు మాట్లాడుతూ, మే 31న కృష్ణగారు ఊటీలో ఉన్నా కూడా ఫ్యాన్స్ అక్కడికి వెళ్లి పుట్టినరోజు వేడుకను సెలెబ్రేట్ చేసేవారు. కృష్ణ గారు లేకుండా జరుగుతున్న మొట్టమొదటి జయంతి ఇది. అభిమానులు ఎలా అయితే ఆయనని ప్రేమిస్తారో, ఆయన కూడా అభిమానులను అంతే ఇష్టపడతారు అని చెప్పారు వినాయకరావు.

Updated Date - 2023-05-31T15:19:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!