సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Krishna Gadu Ante Oka Range: సినిమా కూడా ఓ రేంజ్‌లో ఉంటుందట

ABN, First Publish Date - 2023-08-02T20:45:46+05:30

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్‌పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 4న విడుదల కాబోతుండగా.. మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

Krishna Gadu Ante Oka Range Pre Release Event

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్‌పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యుబైఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఆగ‌స్ట్ 4న ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, టీఎఫ్‌సీసీ సెక్రటరీ కే ఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, రైటర్ ప్రసన్న కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (Krishna Gadu Ante Oka Range Movie)


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్. చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రంగా సినిమాను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతీ టీం మెంబర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా వరంగల్ వాళ్లకి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలని తెలిపారు. ‘కంటెంట్ ఉంటే సినిమాలు ఆడుతాయి. కంటెంట్‌ను మాత్రమే కాకుండా కాస్ట్ ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవాలి. అవి రెండూ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాంటి విలేజ్, లవ్ స్టోరీలకు హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా బాగుండాలి. ఈ మూవీకి అన్నీ చక్కగా కుదిరాయని అనుకుంటున్నాను. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని టీఎఫ్‌సీసీ సెక్రటరీ, నిర్మాత కే ఎల్ దామోదర్ ప్రసాద్ తెలిపారు. ‘నిర్మాత రఘు ఈ ఎంతో ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాడు. ఎంతో రిస్క్ చేసి మంచి కథను ఎంచుకుని సినిమా తీశారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఆగస్ట్ 4న ఈ సినిమాను అందరూ ఆశీర్వదించాలి’ అని అన్నారు బెక్కం వేణుగోపాల్. (Krishna Gadu Ante Oka Range Event)

నిర్మాత పెట్లా ర‌ఘురామ్‌ మూర్తి మాట్లాడుతూ.. ‘‘రెండున్నరేళ్ల ప్రయాణం ఈ సినిమా. సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా చేసుకుంటూ సినిమాల్లోకి ఎందుకు వచ్చావ్ అని అందరూ అడుగుతున్నారు. సినిమా ద్వారా మనుషుల్ని కదలించొచ్చు. ప్రతి మనిషి జీవితంలో కథలుంటాయి. కృష్ణ అనే యువ‌కుడి క‌థే ఇది. తండ్రి క‌ల‌ను నేర‌వేర్చ‌టానికి కొడుకు ప‌డ్డ క‌ష్టం. త‌న ప్రేమ‌, భావోద్వేగాల‌ను అందంగా చూపించే ప్ర‌య‌త్నమే మా ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, ఆశీర్వదించాల్సిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. మంచి టీమ్‌ని ఇచ్చి, ఏది అడిగితే అది ఇచ్చిన నిర్మాతలకు దర్శకుడు రాజేష్ దొండపాటి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Jailer Trailer: ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవ్.. కోతలే!

**************************************

*Poonam Kaur: పాలిటిక్స్, వినోదానికి లింక్ చేస్తూ ట్వీట్.. ‘బ్రో’ గురించేనా?

**************************************

*Malavika Mohanan: కఠిన నిర్ణయం తీసుకున్నా.. ఇకపై ప్రాధాన్యం ఉండాల్సిందే

**************************************

*VK Naresh: కోర్టులో నరేష్‌కి ఊరట.. రమ్యరఘుపతి తన ఇంట్లోకి రాకుండా నిషేధం

********************************************

*Kalyani: దర్శకుడు సూర్యకిరణ్‌తో కళ్యాణి విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా?

**************************************

Updated Date - 2023-08-02T20:45:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!