సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Krishna Gadu Ante Oka Range: చూడు చూడమంటున్న యూత్‌ఫుల్ లవ్ సాంగ్

ABN, First Publish Date - 2023-02-15T22:21:11+05:30

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలలో యూత్ ఆడియన్స్ మెచ్చే కథాకథనం ఉందంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం పక్కా..

Krishna Gadu Ante Oka Range Movie Still
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలలో యూత్ ఆడియన్స్ మెచ్చే కథాకథనం ఉందంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం పక్కా. ఇది అనేక మార్లు రుజువైంది కూడా. ఇప్పుడు అలాంటి కథ, కథనాలతో వస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ (Krishna Gadu Ante Oka Range). శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్‌పై కొత్త హీరోహీరోయిన్లు రిష్వి తిమ్మరాజు (Rishvi Thimmaraju), విస్మయ శ్రీ (Vismaya Sri)‌లను పరిచయం చేస్తూ పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో రాజేష్ దొండపాటి (Rajesh Dondapati) డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా లవ్ ఆంథెమ్ ఆఫ్ 2023 పేరుతో ఓ యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

చూడు చూడు చూడమంటూ గుండె.. (Choodu Choodu Choodamantu Gunde) అంటూ సాగిపోతున్న ఈ పాటకు వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించగా.. యశస్వి కొండేపూడి, సాహితి చాగంటి ఆలపించారు. లిరిక్స్ కి తగ్గ విజువల్స్ జోడించి ఈ సాంగ్ రూపొందించిన విధానం యూత్ ఆడియన్స్ మెప్పు పొందేలా ఉంది. నిజమైన ప్రేమికుల ఫీలింగ్స్ చెబుతూ పల్లెటూరి వాతావరణంలో షూట్ చేసిన ప్రతి సీన్ కూడా పాటలో హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. సాబు వర్గీస్ బాణీలు అందించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

కాగా, ఇప్పటికే ఈ ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకోగా.. ఇప్పుడు విడుదలైన చూడు చూడు లిరికల్ సాంగ్‌కు కూడా మంచి ఆదరణ లభించినందుకు చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. (Krishna Gadu Ante Oka Range Song)

Updated Date - 2023-02-15T22:21:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!