Kida Movie : తాత.. మనవడు.. ఓ మేక.. భావోద్వేగం !
ABN, First Publish Date - 2023-10-16T15:23:41+05:30
‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. పూ రామన్, కాళీ వెంకట్ కీలక పాత్రదారులుగా ఆర్‌ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని 'దీపావళి’ టైటిల్‌తో తెలుగులోకి అనువదిస్తున్నారు.
‘స్రవంతి’ రవికిశోర్(Srvanthi Ravi kishor) నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’(Kida) . పూ రామన్, కాళీ వెంకట్ కీలక పాత్రదారులుగా ఆర్‌ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని 'దీపావళి’ టైటిల్‌తో తెలుగులోకి అనువదిస్తున్నారు. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరిగే కథ ఇది. దానితోపాటు అందమైన ప్రేమకథ కూడా ఉంది. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ దర్శకుడు వెంకట్ రాసిన కథ నచ్చడంతో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించడానికి ముందుకొచ్చారు.
‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘’చెన్నైలో స్నేహితుడి ద్వారా ఐదు నిమిషాల కథ విన్నా. వెంటనే కనెక్ట్ అయ్యాను. దర్శకుడిని కథ మొత్తం రికార్డ్ చేసి పంపమని అడిగా. కథ నచ్చడంతో ఓకే చేశా. దర్శకుడికి తొలి సినిమా అయినా బాగా తీయగలడని, కథకు న్యాయం చేస్తాడనే నమ్మకంతో అతడికి పూర్తి ేస్వచ్ఛ ఇచ్చాను. అతడు స్ర్కిప్ట్ ఏదైతే రాశాడో అదే తెరపైకి తీసుకొచ్చాడు. నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘‘తాతయ్య, మనవడు, ఓ మేకపిల్ల... మూడు పాత్రల మధ్య భావోద్వేగాలు ఈ చిత్రంలో ప్రధానాంశాలు. తమిళనాడులో దీపావళిని సంబరంగా జరుపుతారు. నా చిన్నతనంలో మా అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగాను. బాల్యంలో జరిగిన సంఘటనల స్పూర్తితో ఈ సినిమా తీశా. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లాలో ఓ గ్రామంలో కథ జరుగుతుంది. అన్ని భాషల ప్రేక్షకులకు కథలోని ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి’’ అని అన్నారు.