సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Keerthi suresh: వ్యాపారవేత్తతో పెళ్లి... నిజమేనా?

ABN, First Publish Date - 2023-01-25T17:01:39+05:30

కీర్తిసురేశ్‌ పెళ్లికి సంబంధించిన వార్తలు ఈ మధ్యన నెట్టింట ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. చిన్నప్పటి స్నేహితుడితో ఆమె ప్రేమలో ఉందని గాసిప్‌ వైరల్‌ అవుతోంది. 13 ఏళ్ల నుంచి వీరిద్దరూ సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, అతనొక వ్యాపారవేత్త అనీ, కేరళలో రిసార్ట్స్‌ ఉన్నాయని పలు ఇంగ్లిష్‌ వెబ్‌సైట్లు కథనాలు వండి వార్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీర్తిసురేశ్‌ (Keerthi suresh) పెళ్లికి సంబంధించిన వార్తలు ఈ మధ్యన నెట్టింట ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. చిన్నప్పటి స్నేహితుడితో ఆమె ప్రేమలో (love marriage)ఉందని గాసిప్‌ వైరల్‌ అవుతోంది. 13 ఏళ్ల నుంచి వీరిద్దరూ సీక్రెట్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, అతనొక వ్యాపారవేత్త అనీ, కేరళలో రిసార్ట్స్‌ ఉన్నాయని పలు ఇంగ్లిష్‌ వెబ్‌సైట్లు కథనాలు వండి వార్చారు. అయితే ఇప్పట్లో ఈ జంట పెళ్లి చేసుకోవాలనుకోవడంతో అందుకు మరో నాలుగేళ్లు సమయం ఉందని ఆ కథనం సారాంశం. కొద్ది రోజులు క్రితం నుంచీ కీర్తి సురేశ్‌ పెళ్లి గురించి ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్‌కు చెందిన ఓ సంగీత దర్శకుడితో ప్రేమలో ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ వార్తల్ని కీర్తి సురేశ్‌ కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. తదుపరి ఓ వ్యాపారావేత్తతో వివాహం ఖాయమైందని, ఓ స్టార్‌తో లింక్‌ చేసిన వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి కీర్తి పెళ్లి విషయం వైరల్‌ అవుతోంది. అప్పటినుంచీ కీర్తికి కాబోయేవాడు ఎలా ఉంటాడో అని నెటిజన్లు సెర్చింగ్‌ మొదలుపెట్టారు. అయితే..కీర్తి మాత్రం ఈ విషయంలో ఎక్కడా మాట్లాడలేదు. మహానటి విడుదల తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానని, ఒకవేళ తాను ఎవరినైనా ప్రేమిస్తే ఇంట్లో చెప్పే స్వేచ్చ తనకుందని కీర్తి సురేశ్‌ చెప్పిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం కీర్తి సురేశ్‌ ‘దసరా’, భోళా శంకర్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తమిళంలో ‘మామన్నన్‌’, ‘రఘు తాతా’, ‘రివాల్వర్‌ రీటా’ చిత్రాల్లో నటిస్తున్నారు. (Mahanati)

Updated Date - 2023-01-25T17:04:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!