కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kamal Haasan : మా ఇద్దరి స్నేహం ఎలాంటిదో తెలుసుగా..!

ABN, First Publish Date - 2023-09-17T15:36:03+05:30

దుబాయిలో జరిగిన సైమా-2023 (SIIMA) అవార్డుల వేడుక వేదికగా కమల్‌హాసన్‌ (Kamal haasan) రజనీకాంత్‌ (Rajani kanth) గురించి ప్రస్తావించి ఆహుతులను ఆశ్చర్యపరిచారు. ‘విక్రమ్‌’ (Vikram) చిత్రానికి గానూ ఈ ఏడాది ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్నారు కమల్‌ హాసన్‌.

దుబాయిలో జరిగిన సైమా-2023 (SIIMA) అవార్డుల వేడుక వేదికగా కమల్‌హాసన్‌ (Kamal haasan) రజనీకాంత్‌ (Rajani kanth) గురించి ప్రస్తావించి ఆహుతులను ఆశ్చర్యపరిచారు. ‘విక్రమ్‌’ (Vikram) చిత్రానికి గానూ ఈ ఏడాది ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్నారు కమల్‌ హాసన్‌. కమల్‌ - రజినీకాంత్‌ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే! తమ అనుబంధాన్ని గురించి చెబుతూ సైమా వేదికగా కమల్‌హాసన్‌ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా తన అభిమాని అయిన దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌(lokesh Kanakaraju) ను మెచ్చుకున్నారు. లోకేశ్‌ - రజనీకాంత్‌ కాంబోలో రానున్న సినిమా గురించి మాట్లాడారు. ‘‘లోకేశ్‌ కనగరాజ్‌ నాకు వీరాభిమాని. ఇటీవల అతడు నా స్నేహితుడు రజనీకాంత్‌తో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. దీనిపై పలువురు ‘రజనీకాంత్‌తో మీ అభిమాని సినిమా చేయడం ఏంటి?’ అనే సందేహాలు వ్యక్తం చేశారు. సాధారణ ప్రేక్షకులకు అది మాత్రమే తెలుసు. కానీ నాకు మాత్రం వాళ్లిద్దరూ సినిమా చేయడం ఆనందంగా ఉంది. గర్విస్తున్నా. దాదాపు 15 ఏళ్ల క్రితం ‘కమల్‌ 50’ అనే కార్యక్రమంలో మా స్నేహబంధం గురించి మాట్లాడా. రజనీకాంత్‌ - కమల్‌హాసన్‌ లాంటి ఫ్రెండ్స్‌ ఆనాటి తరంలో ఎవరూ లేరు. మా మధ్య కూడా పోటీ ఉండేది. కానీ, అయితే అది ద్వేషంతో కూడా ఆరోగ్యకరంగా ఉండేది. దానివల్లే మేము ఈ స్థాయికి చేరుకున్నాం’’ అని కమల్‌ చెప్పారు. ఆయన తదుపరి చిత్రం మణిరత్నంతో చేయనున్న సంగతి తెలిసిందే! ఆ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘నాయగన్‌’ కోసం ఎలా అయితే ప్రశాంతంగా వర్క్‌ చేశామో దీని కోసం కూడా అలాగే పనిచేస్తున్నాం. ప్రేక్షకులకు వినోదం పంచడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తీస్తున్నాం. ఈ సినిమా కోసమే గడ్డం పెంచుకుంటున్నా’’ అని కమల్‌ అన్నారు.

Updated Date - 2023-09-17T15:36:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!