సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Kajal aggarwal: బాలీవుడ్‌పై కాజల్‌ సంచలన వ్యాఖ్యలు!

ABN, First Publish Date - 2023-03-31T12:03:29+05:30

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమపై హీరోయిన్‌ కాజల్‌ (Kajal) సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా హౌస్‌ నిర్వహించిన సెషన్‌లో పాల్గొన్న ఆమె ‘సౌత్‌ వర్సెస్‌ బాలీవుడ్‌’ (south vs Bollywood) అనే అంశంపై మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమపై హీరోయిన్‌ కాజల్‌ (Kajal) సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా హౌస్‌ నిర్వహించిన సెషన్‌లో పాల్గొన్న ఆమె ‘సౌత్‌ వర్సెస్‌ బాలీవుడ్‌’ (south vs Bollywood) అనే అంశంపై మాట్లాడారు. ఈ వేదికపై బాలీవుడ్‌ గురించి వ్యాఖ్యలు (Kajal commets) చేశారు. ‘‘నేను ముంబయి అమ్మాయిని. నటిగా నా కెరీర్‌ మొదలైంది మాత్రం హైదరాబాద్‌లో. ఉత్తరాది అమ్మాయిని అయినా తెలుగు, తమిళ సినిమాల్లోనే నేను ఎక్కువగా పనిచేశాను. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హైదరాబాద్‌, చెన్నైలనే నా సొంత ఇళ్లుగా భావిస్తా. నేను సినిమాల్లో ఉన్నా లేకపోయినా అది మాత్రం మారదు. జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఎక్కువ మంది హిందీ సినిమాల్లో నటించానుకుంటారు. కానీ దక్షిణాది చిత్రపరిశ్రమలో ఫ్రెండ్లీ అట్మాస్పియర్‌ ఉంటుంది. బీటౌన్‌లో అది లేదు. ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. అద్భుతమైన దర్శకులు, టెక్నీషియన్స్‌ అక్కడ ఉన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ్ఘ?ిషల్లో మంచి కథలు పుట్టుకొస్తున్నాయి. నా మాతృ భాష హిందీ. బాలీవుడ్‌ చిత్రాలు చూస్తు పెరిగాను. బాలీవుడ్‌లో కూడా నాకు మంచి ఆఫర్లు వచ్చాయి. చేశాను కూడా. కానీ, దక్షిణాది పరిశ్రమలో ఉన్న నైతికత, విలువలు, క్రమశిక్షణ బాలీవుడ్‌లో లోపించాయని నా అభిప్రాయం. అందుకు చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు’’ అని అన్నారు. దీంతో బీటౌన్‌ అభిమాను?ని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా కాజల్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. మరి కాజల్‌ బీటౌన్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటన్నది తెలియాలి. (Kajal comments on bollywood)

పెళ్లి అనంతరం నటనకు రెండేళ్లు గ్యాప్‌ ఇచ్చిన కాజల్‌ ఇప్పుడు మళ్లీ కానున్నారు. ప్రస్తుతం కాజల్‌ ‘ఇండియన్‌ -2’ (indian 2) చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు భార్య ఇంటి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు.

Updated Date - 2023-03-31T13:21:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!