సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kajal Aggarwal: పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ ‘సత్యభామ’

ABN, First Publish Date - 2023-06-19T13:11:03+05:30

‘‘ఇక సినిమాలకు దూరం’’ అన్నట్లు అర్థం వచ్చేలా కాజల్‌ చేసిన ట్వీట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసింది. దాంతో కాజల్‌ ఇకపై సినిమాలు చేయదట అంటూ అభిమానులు నిరాశ పడ్డారు. రెండు రోజులు గడవగానే కాజల్‌కు సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ఇక సినిమాలకు దూరం’’ అన్నట్లు అర్థం వచ్చేలా కాజల్‌ (Kajal) చేసిన ట్వీట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసింది. దాంతో కాజల్‌ ఇకపై సినిమాలు చేయదట అంటూ అభిమానులు నిరాశ పడ్డారు. రెండు రోజులు గడవగానే కాజల్‌కు సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘కాజల్‌60’ (Kajal 60) టైటిల్‌ ప్రకటించబోతున్నాం’ అని మేకర్స్‌ ఓ పోస్టర్‌ వదలగానే అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ కాజల్‌ నటిస్తున్న 60వ చిత్రం ‘సత్యభామ’ (Satyabhama). అఖిల్‌ డేగల దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. శశికిరణ్‌ తిక్క స్ర్కీన్‌ప్లే సమకూర్చడంతోపాటు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

సోమవారం కాజల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను, కాజల్‌ లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar kammula) అతిథిగా హాజరై టైటిల్‌ లోగోను రివీల్‌ చేశారు. ఈ చిత్రంలో కాజల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా కాజల్‌ మాట్లాడుతూ ‘‘సత్యభామ’ చిత్రంతో ఈ పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా మారింది. తెలుగులో మళ్లీ అవకాశాలు రావడం, ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తెలుగు సినిమా నా పుట్టినిల్లుతో సమానం’’ అని అన్నారు.

‘‘పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ని విజయవంతంగా కొనసాగించవచ్చని అనడానికి కాజల్‌ ఓ నిదర్శనం. ‘సత్యభామ’లో కాజల్‌ పాత్ర, డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి’’ అని శేఖర్‌ కమ్ముల అన్నారు.

Updated Date - 2023-06-19T13:11:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!