కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kajal : సత్యభామగా యాక్షన్ అదరగొట్టింది

ABN, First Publish Date - 2023-11-10T15:05:33+05:30

కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సత్యభామ'. సుమన్ చిక్కాల దర్శకుడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం 'సత్యభామ' టీజర్ విడుదల చేశారు.

కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సత్యభామ'. సుమన్ చిక్కాల దర్శకుడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. 'మేజర్' చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం 'సత్యభామ' టీజర్ విడుదల చేశారు. ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించే క్రమంలో సత్యభామ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అన్న ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది.

హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతుంటుంది. పై అధికారులు సత్య..ఈ కేసు నీ చేతుల్లో లేదు అని చెబితే..కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ అంటుంది సత్య. అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల వేట మొదలుపెడుతుంది సత్యభామ. ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధరంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ కేసును క్లోజ్ చేసేది లేదన్న సత్యభామ...యువతి హత్యకు కారణమైన హంతకులను చట్టం ముందు నిలబెట్టిందా లేదా అనే అంశాలతో టీజర్ ఆసక్తికరంగా ముగిసింది. ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర కీలక పత్రాలు పోషిస్తున్న ఏ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-11-10T15:44:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!