Junior NTR: నా హృదయపూర్వక అభినందనలు
ABN, First Publish Date - 2023-03-13T17:05:01+05:30
ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్ (Oscars 95) అవార్డును గెలుచుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది.
ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఆస్కార్ (Oscars 95) అవార్డును గెలుచుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ లో హీరోగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘మేం ఆస్కార్‌ను సాధించాం. కీరవాణి గారికి, ఎస్ఎస్. రాజమౌళి, చంద్ర బోస్, చిత్ర బృందంతో సహా దేశం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’’ అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. అలాగే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) చిత్ర బృందాన్ని అభినందించారు. ‘‘ఆస్కార్ గెలుచుకున్న మొదటి ఇండియన్ డాక్యుమెంటరీగా మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ విధంగానే మీరు మరిన్ని కథలను చెప్పాలనుకుంటున్నాను. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ బృందానికి నా శుభాకాంక్షలు’’ అని తారక్ తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. ‘‘భారత్ భిన్నమైన దేశం. ఇండియాలో అనేక సాంస్కృతిక సంప్రదాయాలున్నాయి.ఈ సాంప్రదాయాలనే మీరు ‘ఆర్ఆర్ఆర్’ లో చూస్తారు. అందువల్ల ప్రపంచానికి అనేక కథలను చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండియా నుంచి అనేక భావోద్వేగాలతో కూడిన స్టోరీలను చూడవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ తో ఫిల్మ్ మేకర్స్‌కు అందరికి ఆత్మవిశ్వాసం వస్తుంది’’ అని తారక్ స్పష్టం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ అంతకు ముందే అనేక అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకుంది. హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డును గెలుపొందింది. ప్రతి ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని సాధించింది. గోల్డెన్ గ్లోబ్స్‌లోను ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ అందించారు. చంద్రబోస్ గీతరచయితగా వ్యవహరించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Sharon Stone: శృంగార చిత్రం చేయడంతో నా కుమారుడు దూరమయ్యాడు
Comedian Raghu: జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్.. ఆయన జోలికేస్తే ప్రాణాలు తీస్తా..
Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!
Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు
Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!
Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!
Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్ ఛాన్స్ ఎవరికంటే..?
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్