Jr.NTR: ఫ్యామిలీతో జపాన్‌కు జూ.ఎన్టీఆర్.. ఫొటోస్ వైరల్
ABN, Publish Date - Dec 25 , 2023 | 02:27 PM
జూ.ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ కోసం జపాన్‌కు వెళ్లిపోయారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భార్య ప్రణీత, కుమారుడు భార్గవ్ రామ్, అభయ్ రామ్‌లతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జూ.ఎన్టీఆర్ (NTR) తన ఫ్యామిలీతో కలిసి హాలీడేస్ కోసం జపాన్‌కు వెళ్లిపోయారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భార్య ప్రణీత, కుమారుడు భార్గవ్ రామ్, అభయ్ రామ్‌లతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత మూడు నెలలుగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో చేస్తున్న 'దేవర’ (Devara) చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన ఇటీవల గోవాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకోవడంతో సినిమాకు కాస్త విరామం ఇచ్చి కుటంబంతో కలిసి జపాన్‌కు విహారయాత్రకు వెళ్లారు. తిరిగి పది రోజుల తర్వాత ఇండియాకు వచ్చి షూటింగ్‌లో పాల్గొననున్నాడు.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న విడదల చేస్తున్నామని ప్రకటించిన మేకర్స్ ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హీరో కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుంది. తమిళ సెన్షేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా మరో బాలీవుడ్ స్టార్ సోహైల్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు.
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్, ఆప్‌డేట్స్ కు మంచి స్పందన వచ్చింది. కానీ ఎన్టీఆర్ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుందని, మాకు రెగ్యులర్‌గా ఆప్డేట్స్ కావాలంటూ టీజర్,గానీ సాంగ్స్ కానీ విడుదల చేయాలంటూ ఫ్యాన్స్ చిత్ర యూనిట్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతికి థియేటర్లలో 'దేవర’ (Devara) టీజర్ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.