సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jr Ntr-Allu Arjun: చరణ్ దంపతులకు సెలబ్రిటీల శుభాకాంక్షలు!

ABN, First Publish Date - 2023-06-20T12:16:15+05:30

మెగా ప్రిన్సెస్‌ రాకతో మెగా కుటుంబంలో సందడి నెలకొంది. రామ్‌చరణ్‌-ఉపాసన తల్లిదండ్రులయ్యారు.సోమవారం రాత్రి ఉపాసన అపోలో ఆస్పత్రిలో చేశారు. ఆ సమయంలో భర్త రామ్‌చరణ్‌, అత్త సురేఖ తదితరులు ఉపాసన వెంటే ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా ప్రిన్సెస్‌ (Mega Princess) రాకతో మెగా కుటుంబంలో సందడి నెలకొంది. రామ్‌చరణ్‌ (Ram charan)-ఉపాసన తల్లిదండ్రులయ్యారు.సోమవారం రాత్రి ఉపాసన అపోలో ఆస్పత్రిలో చేశారు. ఆ సమయంలో భర్త రామ్‌చరణ్‌, అత్త సురేఖ తదితరులు ఉపాసన (Upasana) వెంటే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు చిరంజీవి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవి, సురేఖ ఉదయాన్నే తమ మనవరాలిని చూసి మురిసిపోయారు. అల్లు అరవింద్‌ దంపతులు, అల్లు అర్జున్‌(Allu arjun), స్నేహ, విక్కీ, డి.వి.వి.దానయ్య తదితరులు రామ్‌చరణ్‌ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. (allu aravind)

అలాగే పలువు సినీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా రామ్‌చరణ్‌ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ మేరకు జూ. ఎన్టీఆర్‌(Tarak) ట్వీట్‌ చేశారు. ‘‘కంగ్రాట్స్‌ చరణ్‌ - ఉపాసన. పేరెంట్స్‌ క్లబ్‌కు స్వాగతం. ఆడ బిడ్డతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం ఎంతో మధురానుభూతిగా నిలుస్తుంది. అదొక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని ట్వీట్‌ చేశారు తారక్‌.

Updated Date - 2023-06-20T14:12:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!