సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jr Ntr: జపాన్‌ మంత్రి నోట తారక్‌ మాట!

ABN, First Publish Date - 2023-07-28T18:20:22+05:30

జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి జపాన్‌ విదేశీ వ్యవహారాల శాఖమంత్రి హయాషి యోషిమాసా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ నటన నటించిదని అన్నారు. భారత్‌ పర్యటనకు వచ్చిన ఆయన ఓ సమావేశంలో భారతీయ చలన చిత్ర రంగం గురించి మాట్లాడారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ను (Jr Ntr)ఉద్దేశించి జపాన్‌ విదేశీ వ్యవహారాల శాఖమంత్రి హయాషి యోషిమాసా ( Yoshimasa Hayashi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రంలో ఎన్టీఆర్‌ నటన నటించిదని అన్నారు. భారత్‌ పర్యటనకు వచ్చిన ఆయన ఓ సమావేశంలో భారతీయ చలన చిత్ర రంగం గురించి మాట్లాడారు. భారతీయ సినిమాలకు తమ దేశంలో మంచి గుర్తింపు వస్తోందన్నారు. ఇటీవల విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను జపాన్‌ ప్రజలు ఎంతగానో అభిమానించారు అని చెప్పారు. ఈ చిత్రంలో మీకు నచ్చిన హీరో ఎవరని ప్రశ్నించగా ‘‘ఆ చిత్రంలో నటించిన ఇద్దరు హీరోల్లో జూనియర్‌ రామారావు ఎంతో నచ్చారు’’ అని బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట మల్‌చల్‌ చేస్తోంది.

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటించిన సంగతి తెలిసిందే! గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. అదే ఏడాది చివర్లో జపాన్‌లో కూడా ఈ సినిమాను విడుదల చేయగా అక్కడ కూడా ప్రేక్షకుల రుంచి విశేష ఆదరణ పొందింది. దాదాపు రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర రచయిత ఈ చిత్రానికి సీక్వెల్‌ కూడా ఉండొచ్చిని తెలిపారు. హీరోలుగా రామ్‌చరణ్‌, తారక్‌ ఉంటారని దర్శకుడు ఎవరనేది ఇప్పుడే చెప్పాలనుకోవడం లేదని చెప్పారు. హాలీవుడ్‌ స్ఠాయిలో ఈ చిత్రం ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు.

Updated Date - 2023-07-28T18:20:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!