NT Rama Rao: 'దేవర' తంగం చూసారా ఎలా వుందో
ABN, First Publish Date - 2023-11-01T14:22:52+05:30
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్ పక్కన 'దేవర' సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇందులో తంగం పాత్రలో కనపడనుందని, చిత్ర నిర్వాహకులు ఆమె లుక్ ని విడుదల చేశారు
ఎన్ టి రామారావు (NTRamaRao), కొరటాల శివ (KoratalaSiva) కాంబినేషన్ లో వస్తున్న 'దేవర' #Devara సినిమా నుంచి జాన్వీకపూర్ (JahnviKapoor) లుక్ ఒకటి విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె తంగం #Thangam గా కనిపించనుందని చెప్పారు. 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్, ఎన్టీఆర్ పక్కన నటిస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో శ్రీదేవి (Sridevi) ఎలా కనపడేదో ఇప్పుడు ఆమె కుమార్తె అయిన జాన్వీ కపూర్ కూడా అలానే కనపడుతోందని నెటిజన్స్ అంటున్నారు. తల్లికి ఏమాత్రం తీసిపోకుండా కూతురు ఉందని అంటున్నారు.
ఇందులో సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5 న మొదటి పార్టు విడుదల అవుతుందని కూడా అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కొరటాల శివ (KoratalaSiva) 'దేవర' కథని ఎన్టీఆర్ కి కరెక్టుగా సరిపోయేటట్టుగా రాసుకున్నాడు అని, ఇందులో ఎన్టీఆర్ విశ్వరూపం చూడొచ్చు అని కూడా యూనిట్ సభ్యులు అంటున్నారు. ఎన్టీఆర్ ఇందులో రెండు పాత్రల్లో కనపడనున్నాడని తెలిసిందే. ఈ సినిమా కథ ఒక పార్టులో చెప్పే వీలుకాదని, అందుకని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టుగా చిత్ర నిర్వాహకులు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు అదిరిపోయేట్టు వచ్చాయని, దానికి విదేశీ సాంకేతిక నిపుణులను రప్పించి చేయించారు. అనిరుద్ రవిచందర్ (AnirudhRavichander) దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. అలాగే సాబు సిరిల్ (SabuCyril) ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నాడు. ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ (KalyanRam), ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.