సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Jagapatibabu: ఎస్‌ఎస్‌ఎంబీ 28 సీక్రెట్‌ చెప్పేశారు!

ABN, First Publish Date - 2023-04-30T14:54:34+05:30

ఫ్యామిలీ, లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉన్న జగపతి బాబు ‘లెజెండ్‌’ చిత్రంతో తన రూట్‌ మార్చారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, ప్రతినాయక ఛాయలున్న పాత్రలతో మెప్పిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్యామిలీ, లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ విపరీతంగా ఉన్న జగపతి బాబు (Jagapatibabu) ‘లెజెండ్‌’ చిత్రంతో తన రూట్‌ మార్చారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, ప్రతినాయక ఛాయలున్న పాత్రలతో మెప్పిస్తున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ విలన్‌గా, రిచ్‌ ఫాదర్‌గా విలక్షణమైన పాత్రలతో దూసుకెళ్తున్నారు. మహేశ్‌ హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’(Srimanthudu), ‘మహర్షి’ (Maharshi) చిత్రాల్లో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌ నటిస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ28(SSMB28)లో జగపతిబాబు బలమైన పాత్ర చేయనున్నారు. ఆ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

‘‘మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (trivikram) నా కోసం అద్భుతమైన పాత్రలు సృష్టిస్టారు. నటనకు ఆస్కారమున్న ప్రతి చోట నన్ను భాగం చేస్తారు. గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో నటించాను. ఇప్పుడు దానికంటే కొత్తగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇందులో నా క్యారెక్టర్‌ ఆ పాత్ర కంటే వైల్డ్‌గా.. భయంకరంగా ఉంటుంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంటుంది. దానిని కచ్చితంగా ఇష్టపడతారు’’ అని జగపతి బాబు తెలిపారు.

సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో జగపతిబాబు మంచి జోరు మీదున్నారు. నటనకు ఆస్కారమున్న పాత్రలతోపాటు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌ ‘సలార్‌’లో ఓ పాత్ర చేస్తున్నారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదల కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అంతే కాదు అల్లు అర్జున్‌ ‘పుష్ప-2’చిత్రంలోనూ నటిస్తున్నారు. బాలీవుడ్‌లో మూడు ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు.

Updated Date - 2023-04-30T15:31:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!