సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Salaar: జగపతిబాబు వ్యాఖ్యలు.. మరోసారి వైరల్‌!

ABN, First Publish Date - 2023-07-16T18:03:39+05:30

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంతో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే! టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. ఈ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్న జగపతిబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’(Salaar). ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంతో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే! టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. ఈ చిత్రంలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషిస్తున్న జగపతిబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు మాట్లాడుతూ ‘‘సలార్‌’ మొదటి భాగంలో తనకు, ప్రభాస్‌కు మధ్య ఒక్క సన్నివేశం కూడా లేదని చెప్పారు. రెండో భాగంలో యాక్షన్‌ సన్నివేశాల్లో ఉండే అవకాశం ఉందని తెలిపారు. దాంతో ఈ చిత్రంలో మెయిన్‌ విలన్‌ మరెవరన్నా ఉన్నారా? అనే చర్చ మొదలైంది. అంతే కాదు కథ వినకుండా ఈ చిత్రం ఓకే చేశారని జగపతిబాబు గత ఇంటర్వ్యూలో అన్నారు. యాక్షన్‌ చిత్రంగా రానున్న ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ సినిమాలో పతాక సన్నివేశాలు ఊహించని రీతిలో ఉంటాయని నిర్మాత అంటున్నారు.

ఇటీవల విడుదలైన టీజర్‌తో ‘సలార్‌’ రెండు భాగాలుగా రానున్నట్లు ప్రశాంత్‌ నీల్‌ చెప్పేశారు. కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఐదు భాషల్లో రూపుదిద్దుకుంటుందీ సినిమా. ప్రభాస్‌ సరసన శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి కీలక పాత్రధారులు. సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

Updated Date - 2023-07-16T18:03:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!