చద్దన్నం.. ఆవకాయ.. జగ్గూభాయ్ ఏందిది?
ABN, First Publish Date - 2023-05-10T14:12:04+05:30
ఈమధ్యకాలంలో జగపతిబాబు(Jagapatibabu)సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఒకప్పుడు ఆయనకు సోషల్ మీడియాలో అకౌంట్ కూడా ఉండేది కాదు.
ఈమధ్యకాలంలో జగపతిబాబు(Jagapatibabu)సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఒకప్పుడు ఆయనకు సోషల్ మీడియాలో అకౌంట్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఆసక్తికర ఫొటో షేర్ చేశారు. ఆవకాయ పచ్చడితో (Aavakaya Pacchadi) అన్నం తింటున్న ఫొటోను షేర్ చేసి ఆసక్తికర కామెంట్ చేశారు. ‘ఏ దేశం వెళ్లినా.. సద్దన్నంలో ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే ఉండే మజానే వేరు. ‘మా అత్తగారు ఇచ్చిన ఆవపిండి కలిపిన ఆవకాయ పచ్చడి పొద్దునే కలుపుకొని పందికొక్కులా తింటున్నా’ అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో జగపతిబాబు (photos viral) బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకున్న ఆయన ‘లెజెండ్’తో విలన్ పాత్రలకు సై అన్నారు. అక్కడి నుంచి వరుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు. తాజాగా ‘రామబాణం’ చిత్రంలో గోపీచంద్‌కు అన్నయ్యగా కనిపించారు. ప్రభాస్ సలార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్ఎస్ఎంమీ 28లో కూడా బలమైన పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు.