Jagapathi Babu: ఖాన్సార్ పేరు వినగానే అతనెవరు అనుకున్నా!
ABN, Publish Date - Dec 22 , 2023 | 11:38 AM
‘‘ప్రభాస్‌కు (Prabhas) ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. ఇలాంటి వారు చాలా అరుదు’’ అని జగపతిబాబు (Jagapathi Babu) అన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’లో (Salaar) ఆయన ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రం గురించి తాజాగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
‘‘ప్రభాస్‌కు (Prabhas) ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. ఇలాంటి వారు చాలా అరుదు’’ అని జగపతిబాబు (Jagapathi Babu) అన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’లో (Salaar) ఆయన ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రం గురించి తాజాగా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘కలిసిన ప్రతిసారీ మీ దర్శకత్వంలో నటించాలనుందని ప్రశాంత్ నీల్‌కు చెబుతుండేవాడిని. దాన్ని గుర్తుపెట్టుకున్న ఆయన ఓ రోజు ఫోన్ చేసి ‘సలార్’లో విలన పాత్ర గురించి చెప్పారు. ఇందులో నేను పోషించిన రాజమన్నార్ పాత్ర తీరు, లుక్ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో.. ఖాన్సార్ అనే కోటను మనిషిలా భావించడమనే కాన్సెప్ట్ నన్ను ఎంతో ఆకట్టుకుంది. అయితే, ఖాన్సార్ గురించి తొలిసారి విన్నప్పుడు అతడెవరు? ఈ సినిమాలో నాకంటే పెద్ద విలన్ ఉన్నాడా? అని అనుకున్నా. ఖాన్సార్‌కు నేనే రాజునని తర్వాత తెలిసింది. ప్రభాస్ మంచి వ్యక్తి. అతనికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. ఇలాంటి వారు అరుదు. పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతమైన నటుడు. దర్శకుడు ప్రశాంత్, డిఓపి భువన్ గౌడ ఎంత పెద్ద సన్నివేశమైనా సింగిల్ షాట్‌లోనే తీస్తారు. వాళ్లు చెప్పింది నటులు ఫాలో అయితే చాలు. అవుట్‌పుట్ అద్భుతంగా ఉంటుంది. ‘సలార్’ పార్ట్ 2లో నా క్యారెక్టర్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని భావిస్తున్నా’’ అని జగపతి బాబు చెప్పుకొచ్చారు. ‘కేజీయఫ్’ సిరీస్ హిట్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రమిది. శ్రుతి హాసన్ కథానాయిక. ఈశ్వరీ రావు, టీనూ ఆనంద్, శ్రియా రెడ్డి కీలక పాత్రధారులు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.