సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ishwarya : ఆయనంటే క్రష్‌.. దేనికైనా రెడీ!

ABN, First Publish Date - 2023-02-16T14:21:16+05:30

పవన్‌కల్యాణ్‌ అంటే పిచ్చని చెబుతోంది సీరియల్‌ ఆర్టిస్ట్‌, జబర్దస్‌ ఫేం ఐశ్వర్య. అవకాశం వస్తే ఆయన సినిమాలో పని మనిషి పాత్ర అయినా చేస్తానని అంటోంది. తాజాగా ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన ఆమె ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్‌కల్యాణ్‌ (Pawan kalayan)అంటే పిచ్చని చెబుతోంది సీరియల్‌ ఆర్టిస్ట్‌, జబర్దస్‌ ఫేం ఐశ్వర్య( ishwarya vullingala). అవకాశం వస్తే ఆయన సినిమాలో పని మనిషి పాత్ర అయినా చేస్తానని అంటోంది. తాజాగా ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన ఆమె ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా కెరీర్‌ గురించి, పవన్‌కల్యాణ్‌పై ఉన్న అభిమానం గురించి చెప్పుకొచ్చారు. ‘‘టాలీవుడ్‌ (Tollywood) స్టార్స్‌లో నేను అభిమానించే వ్యక్తి పవన్‌కల్యాణ్‌. ఆయన్ను కలిసే అవకాశాలు చాలా వచ్చినా... కలవలేకపోయా. నటిగా గుర్తింపు తెచ్చుకుని. నువ్వు ఫలానా కదా అని గుర్తించాక ఆయన్ను కలవాలని నా ఆశ. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రోజు నుంచీ పవన్‌కల్యాణ్‌ సినిమాలో కనిపించాలని కోరిక. కానీ ఒక కండీషన్‌. పవన్‌కల్యాణ్‌గారి సినిమాలో పని మనిషిగా చిన్న పాత్ర అయినా చేస్తాను కానీ... ఆయనకు అక్కాచెల్లిగా మాత్రం నటించను. ఆయన పేరు వింటేనే నాకు రోమాలు నిక్కబోడుచుకుంటాయి. పవన్‌ కల్యాణ్‌గారి కోసం ఏం (Jabardasth fame ishwarya) చేయడానికైనా రెడీ. ఆయనంటే అంత క్రష్‌ నాకు. ఆయన చేసే పాత్రలు, సేవా కార్యక్రమాలు చూసి చాలా ఇన్‌స్పైర్‌ అవుతుంటా. రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఆయన నాకెంతో స్ఫూర్తి’’ అని అన్నారు.( ishwarya crush on pawan kalyan)

ఆదితో రూమర్స్‌..(Rumors with hyper aadi)

మోడలింగ్‌, ఈవెంట్స్‌లో ప్రారంభమైన తన కెరీర్‌ టీవీ సీరియళ్ల వరకూ వెళ్లిందని చెప్పుకొచ్చారు ఐశ్వర్య. ‘‘తొలుత టీవీ నటిగానే అందరికీ తెలుసు. ‘జబర్దస్ట్‌’లో అడుగుపెట్టాక పాపులర్‌ అయ్యాను. శ్రీదేవి డ్రామా కంపెనీతో మరింత గుర్తింపు వచ్చింది. లవ్‌ మీద రెస్పెక్ట్‌ ఉంది. ప్రస్తుతానికి అమ్మతో ప్రేమలో ఉన్నా. అమ్మ ప్రేమను మించిన ప్రేమ దొరికితే అప్పుడు ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తా. ‘హైపర్‌’ ఆది అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. మా ఇద్దరిపై రూమర్స్‌ కూడా వచ్చాయి. చాలామంది ‘ఆదిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌’ అని అడుగుతారు. ప్రస్తుతానికి నేను సింగిల్‌గా ఉన్నా. రూమర్స్‌ గురించి పట్టించుకోను. ప్రస్తుతం ఓ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. నటనపైనే నా దృష్టంతా’’ అని తెలిపారు.

Updated Date - 2023-02-16T14:44:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!